ఇన్స్టా ట్విట్టర్లో యువహీరో నగ్నఫొటో.. ఖంగుతిన్న నెటిజన్లు

0

అతడో యువహీరో.. ఎందరో అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటారు. రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలు పోస్టు చేస్తుంటారు. అతడు పొరపాటున ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నగ్న ఫొటో పెట్టాడు. కొన్ని నిమిషాలపాటు ఆ ఫొటో అలాగే ఉండిపోయింది. ఆ వీడియోలో అతడి ప్రైవేట్ పార్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకేముంది..ఆ వీడియో చూసిన నెటిజన్లు బిత్తరపోయారు. కొన్నినిమిషాలపాటు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్న అతడి అభిమానులంతా ఖంగుతిన్నారు. ఆ వీడియో చూడలేక చస్తున్నాం తొందరగా తీసేయ్రా బాబు.. అంటూ కామెంట్లు పెట్టారు. ఆ యువహీరో మన భారతీయ నటుడు కాదులెండి..

అవెంజర్స్ హీరో ఇవాన్స్.. సోమవారం ఉదయం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో ఓ చిన్నపాటి వీడియోక్లిప్ను అప్లోడ్ చేశాడు. ఈ వీడియో చివర్లో అతడి నగ్నఫొటో ఉంది. ఈ ఫోటో ఆ వీడియోలోకి ఎలా వచ్చిందో తెలియదు. ఇవాన్స్ తేరుకొని ఆఫోటోను డిలిట్ చేసేలోపే ఇన్స్టా ట్విట్టర్ దద్దరిల్లి పోయింది. ఈ ఫోటోపై మీమ్స్ కామెంట్లు వరదలా వచ్చిపడ్డాయి. చాలా మంది దీన్ని సరదాగా తీసుకున్నప్పటికీ.. చిన్నపొరపాటు వల్ల ఇవాన్స్ ఇజ్జత్ పోయింది. ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో ఫోటోలు అప్ లోడ్ చేసే ముందు జర జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివి జరగొచ్చు మరి.