కూతురి బర్త్ డే ని స్పెషల్ గా ప్లాన్ చేసిన సురేఖా వాణి…!

0

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లిగా అక్కగా అత్తగా నటించి అందర్నీ మెప్పించారు. కామెడీ అయినా ఎమోషనల్ క్యారెక్టర్స్ అయినా సరే తనదైన శైలిలో సన్నివేశాలను పండిస్తుంది సురేఖ. తెలుగు – తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటి ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గానూ పాపులర్ అయింది.

కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన కూతురుతో కలిసి డాన్స్ లు చేస్తూ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా సురేఖా వాణి జోరు మాత్రం తగ్గించడం లేదు. తన భర్త మరణించిన తర్వాత ఇంకొంచెం గ్లామర్ డోస్ పెంచి తన కూతురికి పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ.. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఏ మాత్రం లెక్కచేయకుండా సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుంది.

ఇటీవల లుంగీ కట్టుకుని తన కూతురు సుప్రిత తో కలిసి సురేఖా వాణి చేసిన స్టెప్పులు నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఓ షోలో పార్టిసిపేట్ చేసిన సుప్రిత.. తన తల్లి ఫ్రెండ్ గా ఉంటుందని.. అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోగలిగేంత క్లోజ్ గా ఉంటామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా సురేఖ వాణి తన కూతురి బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది.

సురేఖా వాని కూతురి కోసం తన రూమ్ ని స్పెషల్ గా అలంకరించి.. సుప్రీత కళ్లు మూసి తన రూం వద్దకు తీసుకెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక కూతురు బర్త్ డే సందర్భంగా సురేఖా వాణి ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ”నా చిన్ని యువరాణికి హ్యాపీ బర్త్ డే. నువ్వే నా బలం బలహీనత. నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. నువ్వు నీలాగే ఉండు. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. నా సర్వస్వం నువ్వే. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ కన్నా” అంటూ పోస్ట్ చేసింది.