విడాకులకు కారణం ఆర్థిక ఇబ్బందులే

0

కనుమరుగయిన దర్శకుడు సూర్య కిరణ్ ను అంతా మర్చి పోతున్న సమయంలో మళ్లీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి నేను ఒకడిని ఉన్నాను అంటూ గుర్తు చేశాడు. చిన్నతనంలోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆమెతో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నాడు. పెద్ద పెద్ద గొడవలు ఏమీ లేకుండానే ఆమెతో విడాకులు అయ్యాయి. విడాకులు అయిన విషయం ఆయన చెప్పే వరకు తెలియదు. బిగ్ బాస్ నుండి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ సందర్బంగా కళ్యాణి గారితో విడాకుల గురించి క్లారిటీ ఇచ్చాడు.

మా ఇద్దరి మద్య గొడవలు ఏమీ లేవు. కాని కలిసి ఉండలేక పోయాం అంటూ ఒక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నాడు. ఆమె విడాకులు ఇచ్చి వెళ్లి పోయినా కూడా ఇప్పటికి ఆమె నా భార్యగా భావిస్తున్నాను. మరెవ్వరిని పెళ్లి చేసుకునే ఆలోచన చేయడం లేదు అంటూ సూర్య కిరణ్ చెప్పుకొచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో మీరు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటీ అంటూ జడ్జ్ గారు ప్రశ్నించిన సమయంలో నా వద్ద సమాధానం లేక కళ్యాణి గారిని అడగమన్నాను. ఆమె కూడా సరైన సమాధానం చెప్పలేదు. మీకు పిల్లలు లేరా అంటూ ప్రశ్నించగా లేరు అదే కారణం అంటూ విడిపోయాం అన్నాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో మాత్రం తన ఆర్థిక పరిస్థితి కారణంగానే ఆమె విడాకులు ఇచ్చిందని అన్నాడు.

ఒక సినిమాను సొంతంగా నిర్మించడం జరిగింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మొత్తం తలకిందులు అయ్యింది. నా ఇళ్లు నా కార్లు అన్నికూడా అలా వెళ్లి పోయాయి. బెంజ్ కార్లో తిరిగే వాడిని బైక్ పై తిరిగే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నాకు అప్పులు ఇచ్చిన వారు పదే పదే ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతుండటంతో కళ్యాణికి ఇబ్బంది అనిపించి ఆమె నా నుండి విడిపోవాలనుకుంది. నా ఆర్థిక పరిస్థితిని ఆమె భరించలేక పోయింది. అందుకే ఆమె నాకు విడాకులు ఇచ్చి పోయిందని సూర్య కిరణ్ కొత్త వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో ఇప్పటి వరకు సూర్య కిరణ్ మాత్రమే మాట్లాడుతున్నాడు. కళ్యాణి వర్షన్ మాత్రం ఇంకా రాలేదు. మరి వీటన్నింటికి ఆమె ఏం సమాధానం చెప్పబోతుందో చూడాలి.