స్టార్ హీరోలకు మార్గదర్శకంగా నిలిచేనా?

0

థియేటర్లు బంద్ ఉన్నా కూడా పెద్ద హీరోల సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలకు ఆసక్తి చూపడం లేదు. ఉత్తరాది హీరోలతో పోల్చితే సౌత్ హీరోలు అస్సలు ఓటీటీ వైపు చూడటం లేదు. థియేటర్ల ఓపెన్ కు ఇంకా ఇంకా సమయం పడుతున్న సమయంలో మొదటి సౌత్ స్టార్ హీరో సూర్య ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నాడు. ఆకాశమే నీ హద్దురా సినిమాతో అతి త్వరలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సౌత్ నుండి ఓటీటీలో రాబోతున్న మొదటి స్టార్ హీరో మూవీ అవ్వడంతో ఆకాశమే నీ హద్దురా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ఫలితాన్ని బట్టి మరికొందరు పెద్ద హీరోలు కూడా ఓటీటీ దారి పట్టే అవకాశం ఉంది. జరిగే బిజినెస్ ఆ తర్వాత వచ్చే లాభాలను బట్టి ఇతర హీరోలు మరియు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల విడుదల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు. ఓటీటీలో మీడియం బడ్జెట్ సినిమాలు అంటే పర్వాలేదు కాని మరీ భారీ బడ్జెట్ సినిమాలను అక్కడ విడుదల చేయడం వల్ల పెట్టుబడి కూడా రావని మరీ ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులను నమ్ముకుని భారీ బడ్జెట్ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం కష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ అభిప్రాయంను ఆకాశమే నీ హద్దురా సినిమా చెరిపేస్తుందా అనేది చూడాలి.

తెలుగు దర్శకురాలు సుధ కొంగర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా సుధా కొంగరకు చాలా కీలకం. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన దాఖలాలు లేవు. అందుకే ఈ సినిమాతో అయినా ఆమెకు కమర్షియల్ సక్సెస్ దక్కేనా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సూర్యకు కూడా ఈ సినిమా చాలా కీలకం. ఆయన ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయడం జరిగింది. వచ్చే నెల 30న అమజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి.