వైష్ణవ్ తేజ్ ప్రత్యేక ఇమేజ్ కోసం ప్రాకులాడటం లేదు

0

కొందరు హీరోలు మాస్ ఇమేజ్ కోసం.. మరి కొందరు హీరోలు లవర్ బాయ్ ఇమేజ్ కోసం.. మరికొందరు హీరోలు కమర్షయల్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వారు తీసుకునే నిర్ణయాలు కొన్ని బెడిసి కొడుతూ ఉంటాయి. ఏ హీరో అయితే అన్ని జోనర్ లలో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తాడో ఆ హీరో ఎక్కువ సక్సెస్ లు దక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ లవ్ స్టోరీ సినిమాలు వదిలేసిన హీరోలు చాలా నష్టపోయినట్లే. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ మాత్రం చాలా క్లారిటీగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాడు.

మాస్ క్లాస్ లవ్ స్టోరీ ఇలా అన్ని సినిమాలను చేయాలని భావిస్తున్నట్లుగా ఆయన సినిమాల ఎంపిక చూస్తే అనిపిస్తుంది. మొదటి సినిమా ‘ఉప్పెన’ అంటూ చేసిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆ సినిమా ఫలితంతో సంబంధం లేదు అన్నట్లుగా మరో జోనర్ లో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. వైష్ణవ్ తేజ్ తన సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా మంచి పాత్రలను చేసుకుంటూ వెళ్లాలని భావిస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉప్పెనలో మాస్ హీరో పాత్రలో కనిపించబోతున్న వైష్ణవ్ తేజ్ ను క్రిష్ ఖచ్చితంగా తదుపరి సినిమాలో క్లాస్ హీరోగా ప్రజెంట్ చేసే అవకాశం ఉంది.

వైష్ణవ్ తేజ్ అన్న సాయి ధరమ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం వరుసగా ఫ్లాప్స్ చవి చూశాడు. ఆరు ఫ్లాప్స్ తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయ్యిందేమో ఇప్పుడు అన్ని రకాల పాత్రలు కథలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. దాంతో ఇప్పటికే చిత్రలహరి మరియు ప్రతి రోజు పండుగే సినిమాలతో సక్సెస్ లు దక్కించుకున్నాడు.