Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్టార్ హీరో పెళ్లి ఆగిపోయిందా..?

స్టార్ హీరో పెళ్లి ఆగిపోయిందా..?


తెలుగు మూలలున్న ఓ హీరో తమిళనాట స్టార్ స్టేటస్ అందుకున్నాడు. తన సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. 43 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి న్యూస్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేది. ఓ తమిళ్ హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. తాము కేవలం స్నేహితులమే చెప్తూ వచ్చిన సదరు హీరో.. చివరకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ క్లారిటీ ఇచ్చాడు. తన సామాజిక వర్గానికే చెందిన ఓ తెలుగమ్మాయితో అతని నిశ్చితార్థం జరిగింది. అయితే అప్పటినుంచి హీరో పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ పెళ్లి ఆగిపోయిదంటూ జోరుగా ప్రచారం జరిగింది. హీరో తండ్రి స్వయంగా ఇది నిజం కాదని క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో తాజాగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలకు బలం చేకూరే మరో విషయం సర్క్యులేట్ అవుతోంది.

తాజాగా సమాచారం ప్రకారం ఆ యువతికి హైదరాబాద్ కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ జరిగిందట. త్వరలోనే వీరి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట. నిజానికి హీరో నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో రెండు కుటుంబాలు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే హీరో బర్త్ డే నాడు ఆ యువతి ఇన్స్టాగ్రామ్ లో ఎమోషన్ పోస్ట్ పెడుతూ విషెస్ చెప్పడంతో అవన్నీ రూమర్స్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో హీరోతో జరిగిన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడంతో వీరి పెళ్లి ఆగిపోయిందని టాక్ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ యువతికి మరొకరితో ఎంగేజ్మెంట్ అయిందని అంటున్నారు. ఆ హీరో త్వరలోనే ఈ విషయం గురించి మాట్లాడి పెళ్లి ఆగిపోయినట్లేనని అభిమానులకు క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.