మ్యూజిక్ డైరెక్టర్ ని చితకబాది చెయ్యి విరగ్గొట్టి..!

0

సినిమావాళ్ల గొడవలపై ఫోకస్ ఎక్కువ. లేటెస్టుగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో చితకబాదిన గొడవ రచ్చవుతోంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో దాడికి కారకుల్ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేస్తున్నారు.

ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని .. వర్ధమాన సినీ సంగీత దర్శకుడిపై దాడి చేసి చెయ్యి విరిచేశారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-63/ఏలో నివాసముండే అగస్త్య బోయలపల్లి తెలుగు సినీపరిశ్రమలో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం ఓ చిత్రానికి సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడు.

ఆగస్టు 9న అతడు ఇంట్లో ఉండగా చిట్టి నాగార్జునరెడ్డి- చిట్టి అనుషారెడ్డి- చిట్టి శ్రావ్యలు కలిసి అగస్త్య ఇంటకి వెళ్లి అతడిపై దాడి చేశారు. సెల్ ఫోన్లు లాక్కుని పగులగొట్టడమే గాక.. అతడిని చితక్కొట్టడంతో పారిపోయిన అగస్త్య ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. కుడి చేయి విరిగితే దానికి వైద్యులు కట్టు వేసారట. గురువారం అతడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ను పూర్తి చేస్తున్నారు.