పోర్న్ సైట్లలో ఉన్న తన ఫుటేజ్ పై ఆరేళ్లుగా నటి న్యాయపోరాటం!

0

ప్రముఖ మలయాళ నటి సోనా అబ్రహాం ఆరేళ్లుగా ఇంటర్నెట్ నుంచి తన వీడియో క్లిప్పులను తీయించడం కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2013లో సోనా అబ్రహాం పద్నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు ”ఫర్ సేల్” అనే మలయాళ సినిమాలో నటించింది. సినిమా స్టోరీ ప్రకారం ఒక మైనరు బాలికపై కొందరు అత్యాచారం చేస్తారు.. దానిని వీడియోలో బంధించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.. దీంతో ఆమె అక్క ఆత్మహత్య చేసుకుంటుంది.. ఇదీ ఆ సినిమా కథ. ఆ మైనరు బాలిక పాత్రను సోనా పోషించింది. ముందు నిరాకరించినప్పటికీ చిత్ర యూనిట్ ఆమె తల్లిందండ్రులను ఒప్పించడంతో చివరకు ఆ సన్నివేశాల్లో నటించింది. ఆ సీన్ ని హ్యాండ్ కెమెరాతో ప్రైవేట్ గా షూట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఆమె మీద చిత్రీకరించిన రేప్ సన్నివేశాలు చాలా వరకు ఎడిటింగ్ లో తీసేశారు.

అయితే ‘ఫర్ సేల్’ సినిమాలో లేని ఆ సన్నివేశాలు యూట్యూబ్ లో ప్రత్యక్షం వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాతో పాటు పోర్న్ సైట్లలో కూడా ఆ సన్నివేశాలు దర్శనం ఇవ్వడంతో సోనా మరియు ఆమె తల్లిదండ్రులు ఆవేదనకు గురయ్యారు. ఆ వీడియో క్లిప్పింగులు ఇంటర్నెట్ నుంచి తొలగించాలని సోనా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోనా తల్లిదండ్రులు 2014లో ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్ ను కలిసి కూతురి షూటింగ్ ఫుటేజ్ యూట్యూబ్ లో రాకుండా చేయమని వేడుకున్నారు. యూట్యూబ్ కి కమిషనర్ లెటర్ పెట్టడంతో ఆ వీడియోలు డిలీట్ చేసారు. కాకపోతే అప్పటికే పోర్న్ సైట్స్ లోకి ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలోకి వ్యాపించింది.

ఇప్పటికీ ఆ వీడియో క్లిప్స్ నెట్ లో ఎక్కడో ఒక చోట దర్శనమిస్తూనే ఉన్నాయి. సోనా టెన్త్ లో ఉన్నప్పుడు షూట్ చేసిన ఆ ఫుటేజీ ఇప్పుడు ‘లా’ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నా ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఇందంతా ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ సంస్థ చేపట్టిన ‘రెఫ్యూజ్ ది అబ్యూజ్’ అనే ప్రచారోద్యమం కోసం టీనేజ్ లో తనకు జరిగిన ఆ నమ్మకద్రోహం గురించి సోనా బహిర్గతం చేసినప్పుడు గానీ బయటికి రాలేదు. కేరళ ఉమన్ కమిషన్ సోనాకు అండగా నిలబడింది. కేరళ పోలీస్ హైటెక్ సెల్ ఇంటర్నెట్ నుంచి సోనా వీడియో క్లిప్పులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. సోనా మాత్రం ఆరేళ్ళ నుంచి మానసిక స్థైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు మీద దృష్టి పెట్టింది. ‘లా’ చదువుతూనే నటిగా మోడల్ గా గుర్తింపు సంపాదించింది.

సోనా అబ్రహాం దీనిపై మాట్లాడుతూ.. ”ఆ వీడియోలు ఇంటర్నెట్ లో కనిపించినప్పుడు నా జీవితం ముగిసినట్లే అనిపించింది. అందరూ నన్నే చూస్తూ నా గురించే మాట్లాడుకుంటున్నారన్న భావన కలిగేది. నాకిలా జరగాల్సిందే అనుకోని నన్ను నేను దోషిగా భావించుకున్నాను. ఆ తర్వాత ఆలోచిస్తే ఇందులో నేను చేసిన తప్పేముంది అనిపించింది. తల వంచుకోవలసింది అవమాన పడవలసిందీ నేను కాదు అనుకున్నాను. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను. నా కోసమే కాదు నాలాగే మోసపోతున్న అమ్మాయిల కోసం కూడా పోరాడతాను” అని పేర్కొంది. నటి పార్వతి ఈ ఇష్యూపై స్పందిస్తూ ”సోనా.. జీవితం నరకప్రాయం అవడమంటే ఏమిటో నేను ఊహించగలను. అమ్మాయిల్ని నిరంతరం ఇలాంటి నరకాలు వెంటాడుతూనే ఉంటాయి. మన ధైర్యమే మన పోరాట శక్తి. నువ్వు ఒక్కరివి ఒంటరివి కాదు. నీ వైపు నేనున్నాను. నువ్వు చూపుతున్న మనోబలానికి సాటి మహిళగా అభినందనలు” అని చెప్తూ ఆమెకు మద్ధతుగా నిలిచింది.