చినిగి చాటైందిగా శిల్పాజీ?

0

చినుగుల జీన్సు.. రేబాన్ గ్లాసెస్.. సాగరకన్య ఇస్టయిల్ చూశారా? అందుకే .. ఇప్పటికీ 40 ప్లస్ ఏజ్ లోనూ అదే ఫాలోయింగ్ మ్యాడమ్ శిల్పాజీకి. బాంబే డైయింగ్ రాజ్ కుంద్రాని పెళ్లాడి ఇద్దరు కిడ్స్ కి మామ్ అయినా కానీ ఇంకా ఇంకా అదే స్పీడ్ .. అదే జోరు…

బికినీ బీచ్ సెలబ్రేషన్ తో హీట్ పెంచినా.. బాత్ టబ్ ఫోటోషూట్ తో అగ్గి రాజేసినా .. మ్యాగజైన్ కవర్ షూట్ అంటూ ఆల్మోస్ట్ అర్థ నగ్న ప్రదర్శనలు చేసినా శిల్పా శెట్టి రేంజే వేరు. సాగరకన్యగా ఇప్పటికీ తెలుగు యువత గుండెల్లో తిష్ఠ వేసుకుని కూచుంది అంటే.. అర్థం చేసుకోవాలి.

ఓవైపు ఐపీఎల్ మ్యాచుల్లో శిల్పా శెట్టి సందడి మిస్సవుతోందని అంతా భావిస్తుంటే.. ఈలోగానే ఇదిగో ఇలా ప్రత్యక్షమైంది. చినిగిన జీన్సు.. రేబాన్ గ్లాసెస్ .. ఆ మాస్క్ తో శెట్టి మ్యాడమ్ అదరగొట్టారు. ఆ డెనిమ్ జీను ఫ్యాంటు చినుగుల్లోనే దాగి ఉంది అసలైన రహస్యం. మరీ అంత రెబల్ గా ఏంటిది మ్యాడమ్.. ? చినిగి చాటైందిగా అంటూ ఒకటే కామెంట్లు చేస్తున్నారు బోయ్స్. వైట్ టాప్ .. డెనిమ్ బ్లూ జీన్స్.. ఆపోజిట్ కాంబినేషన్ నావీ బ్లూ హ్యాండ్ గ్లోవ్స్ తో అదరగొట్టేశారు శిల్పాజీ.. ఇంతకీ ఎక్కడికి వెళ్లారో కానీ జంక్షన్ జామైపోయి ఉంటుంది కదా!! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.