హాట్ బ్యూటీ పేస్ తప్ప అంతా చూపిస్తోందిగా..!

0

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సినిమాలతో కంటే ఇలా హాట్ ఫోటోషూట్స్ తో అమ్మడు బాగా పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో మాళవిక పోస్ట్ చేసిన ఫోటో యువ హృదయాల మతులు పోగొడుతోంది. నన్ను చూడు నా అందం చూడు అంటూ ముద్దుగుమ్మ ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలో మాళవిక పేస్ మాత్రం కనిపించకుండా ఉంది. జిమ్ అవుట్ ఫిట్స్ లో ఉన్న ఈ బ్యూటీ వర్కౌట్స్ చేసిన తర్వాత తీసుకున్న పిక్ అని అర్థం అవుతోంది. నడుము నుంచి లిప్స్ వరకు కనిపించేలా పోజ్ ఇచ్చిన మాళవిక కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పుడు నెట్టింట మాళవిక పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటో హల్ చల్ చేస్తోంది.

కాగా ‘డాన్’ ‘మహర్షి’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన కేయూ మోహనన్ కూతురే మాళవిక మోహనన్. ‘పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహన్.. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తమిళ కన్నడ హిందీ ఇండస్ట్రీలలో కాలుమోపింది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో శశికుమార్ కి జోడీగా నటించింది. అందం అభినయం రెండూ ఉన్నా లక్ మాత్రం ఈ బ్యూటీకి కలిసి రావడంలేదు. నిజానికి విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం కావాల్సింది. కాకపోతే ఈ స్పోర్ట్స్ డ్రామా ఒక షెడ్యూల్ షూట్ చేసిన తర్వాత ఓవర్ బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని పక్కన పెట్టేసారు. ప్రస్తుతం ‘ఇళయదళపతి’ విజయ్ – ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మాస్టర్’ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా తర్వాత మలయాళీ బ్యూటీ ఫేట్ మారుతుందేమో చూడాలి.