హీరోయిన్ పై లాడ్జ్ ఓనర్ కంప్లైంట్!

0

తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ విజయలక్ష్మి కొన్ని రోజుల క్రితం తనను ఒక రాజకీయ నేత సోషల్ మీడియా ద్వారా వేదిస్తున్నాడు అంటూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆత్మహత్య విషయం వారం రోజుల పాటు మీడియాలో హడావుడిని సృష్టించింది. తెలుగు మీడియా కూడా ఆమె ఆత్మహత్య యత్నంను ప్రముఖంగా కవర్ చేసింది. ఆ విషయంలో చాలా రోజుల తర్వాత విజయలక్ష్మిని చూశామని అనుకున్నారు. వెండి తెర మరియు బుల్లి తెరపై కనిపించి మెప్పించిన విజయలక్ష్మి ఇప్పుడు మరో వివాదంతో మీడియా ముందుకు వచ్చింది. ఈసారి తనంతట తాను కాకుండా ఒక లాడ్జ్ ఓనర్ ఆమెపై కేసు పెట్టడం వల్ల మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది.

తమిళ మీడియా సంస్థల కథనం ప్రకారం విజయలక్ష్మి కొన్నాళ్లుగా చెన్నైలోని ఒక లాడ్జ్ లో ఉంటుంది. ఆ లాడ్జ్ లోనే ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. లాడ్జ్ యజమాని గత కొన్ని నెలలుగా తనకు చెల్లించాల్సిన అద్దె చెల్లించకుండా విజయలక్ష్మి ఇబ్బంది పెడుతుందని.. తనకు రావాల్సిన మొత్తం రూ.3 లక్షల అద్దెను చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. లాడ్జ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు విజయలక్ష్మిని విచారించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ కేసు విషయమై ఇప్పటి వరకు విజయలక్ష్మి నుండి స్పందన రాలేదు. ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.