పెళ్లిలో స్పై కం డిటెక్టివ్ గెటప్పు కోసం 4 గంటలు పట్టిందట!

0

స్పై పాత్రలో నటించడం అంటే యమ క్రేజీ. పైగా వెడ్డింగ్ స్పై పాత్రలో జాతీయ ఉత్తమ నటుడికి ఆఫర్ వస్తే ఊరుకుంటాడా? ఉతికి ఆరేసాడంతే. ఇంతకీ ఎవరా నటుడు? అంటే సత్య.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుత పెర్ఫామెన్స్ తో కట్టి పడేసిన ది గ్రేట్ మనోజ్ భాజ్ పాయ్.

తాజాగా అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన `సూరజ్ పె మంగల్ భరి` ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడానికి అతడి పాత్ర చిత్రణ ఓ కారణం. ఇందులో మనోజ్ బాజ్పేయిని వెడ్డింగ్ డిటెక్టివ్ గా చూపించారు. రకరకాల విషయాలపై నిఘా పెట్టడానికి భాజ్ పాయ్ రకరకాల అవతారాలను ధరించి అదరగొట్టాడట.

సూరజ్ పె మంగల్ భరి లో మల్టిపుల్ స్పై లుక్స్ కోసం మనోజ్ బాజ్పేయి ప్రిపరేషన్ ఓ రేంజులో సాగిందట. ఇందులో ఒక్కో గెటప్ కోసం 4 గంటలు సమయం తీసుకుని మేకప్ చేశారట. లూడో – చలాంగ్ ట్రైలర్స్ విడుదలైన తర్వాత తాజాగా `సూరజ్ పె మంగల్ భరీ` ట్రైలర్ ఆకర్షించింది. దిల్జిత్ దోసాంజ్- ఫాతిమా సనా షేక్ – మనోజ్ బాజ్పేయి ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదో రొమాంటిక్ కామెడీ డ్రామా. పక్కటెముకలు విరిగేంతగా చక్కిలిగింతలు పెట్టే కామెడీ ఉంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ బాజ్పేయి వెడ్డింగ్ డిటెక్టివ్ గా నటించారు. అతను సీక్రెట్ స్పైయింగ్ కోసం రకరకాల అవతారాలను ప్రదర్శిస్తాడు.

ట్రైలర్లో మనోజ్ భాజ్ పాయ్ రకరకాల అవతారాల్లో కనిపించారు. బిచ్చగాడిగా బిక్షమెత్తడం నుండి పాత కాలం డబ్బవాలా వరకు.. నౌవారీ చీర ధరించిన మహారాష్ట్ర మహిళ గా.. మనోజ్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కాలేదు. ఇందులో ఒక్కో గెటప్ కోసం ప్రోస్తెటిక్ లుక్ లోకి మారిన వైనం ఆసక్తికరం. ప్రతి లుక్ కోసం అతని బృందం సరిగ్గా నాలుగు గంటలు శ్రమించాల్సి వచ్చేదట.

బాలీవుడ్లో అరుదైన నటులలో మనోజ్ ఒకరు. అతను ఏ పాత్రను అయినా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఈ చిత్రంలో అతను పెళ్లిళ్ల గూఢచారి పాత్ర పోషిస్తున్నందున అతను చాలా ఫన్నీగా కనిపిస్తాడు. తాజా ప్రయోగంలో అతడి నటన అందరినీ కట్టిపడేస్తుందని దర్శకుడు వెల్లడించారు.