డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే అంత మక్కువా అమ్మడూ?

0

నిరంతరం సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండే భామల జాబితాలో శ్రద్ధా దాస్ పేరు కూడా పాపులరైంది. ట్యాలెంట్ ని ఎలివేట్ చేసేందుకు రకరకాల మార్గాల్ని ఆశ్రయిస్తోంది ఈ అమ్మడు. ఓవైపు వెండితెర నాయికగా ఫేడవుట్ అయిపోయినా శ్రద్ధా ఫోటోషూట్ల పరంగా సోషల్ మీడియా ప్రచారంలో ఏమాత్రం స్పీడ్ తగ్గడం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలతో యువతరానికి చేరువవుతోంది.

తాజాగా శ్రద్ధా షేర్ చేసిన స్పెషల్ ఫోటో యువతరం సోషల్ మీడియాలు వాట్సాపుల్లో వైరల్ గా మారింది. శ్రద్ధా ఖాతాలోకి ప్రముఖ బ్రాండ్ డిజిటెక్ వచ్చి చేరిందట. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తున్నందుకు లక్షల్లో ప్యాకేజీ అందుకుంటోంది. అందుకే ఆ ముఖంలో వైబ్రేంట్ లుక్ కనిపిస్తోంది మరి. డిజిటేకోఫీషియల్ ఎంతో ఆసక్తిగా ఉంది. రింగ్లైట్ వచ్చింది. ప్లాట్ ఫారమ్ తో సంబంధం లేకుండా ప్రతి కంటెంట్ సృష్టికర్తకు ఇది చాలా అవసరం. రంగుల్లో వైవిధ్యాలు సర్దుబాటు చేయగల ప్రకాశవంతమైన ఎంపికతో వచ్చే డిజిటెక్ రింగ్ లైట్ ఉపయోగించి చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ గా ఎదగండి అంటూ చెప్పుకొచ్చింది. దీనిలో అంతర్నిర్మిత మొబైల్ హోల్డర్ స్టాండ్ ఖచ్చితంగా బోనస్ ఇది మీ బడ్జెట్ లో మీ ఇంటి వద్ద పూర్తి స్టూడియో లాంటిది అంటూ ప్రచారం హోరెత్తించేస్తోంది.

ఫోటోగ్రఫీ యాంగిల్స్ పై శ్రద్ధా ఆసక్తిని వ్యక్తపరిచింది. ఇక ఈ అమ్మడి కెరీర్ సంగతులు చూస్తే.. ఆర్య 2- గుంటూరోడు- మొగుడు ఇలా చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా ఈ అమ్మడి ఫేట్ మారలేదు. వరుణ్ సందేశ్ సరసన పలు చిత్రాల్లో నటించినా అవేవీ కలిసి రాలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలతోనే కాలక్షేపం చేసేస్తోంది. కోటిగొబ్బ 3.. నిరీక్షణ (తెలుగు) అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే వీటికి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

Just got the most awaited #RingLight by @digitekofficial. It is an essential for every content creator, no matter the platform. I have seen the most professional photographers/artists using #DigitekRingLight that comes with colour variations and adjustable brightness option. In built mobile holder stand is definitely a bonus, which makes it a complete studio-like set up at your home, in your budget. While I’m still experimenting new techniques and photography angles with this beautiful Ring Light, but it looks promising. 📸 @shobhik.mallick #ringlight #beautylight #influencers #shootmode #contentcreator #instareels #instatrends #digitekringlight #digiteklight #roundlight #makeupartist #mua #muaindia #photography #photographer #photoshoot #videoshoot #videodiaries

A post shared by Shraddha Das (@shraddhadas43) on