మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ మరో ప్రయత్నం!

0

హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడం పాటు ఎన్నో రకాల పాత్రలను చేసి నటిగా నిరూపించుకున్న మమతా మోహన్ దాస్ కొత్త ప్రయత్నంకు శ్రీకారం చుట్టింది. ఈ మలయాళి ముద్దుగుమ్మ సినిమాల నిర్మాణంలో అడుగు పెట్టబోతున్నట్లుగా ప్రకటించింది. హీరోయిన్స్ సినిమాల నిర్మాణం చేపట్టడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమాల మేకింగ్ విషయంలో చాలా ఆసక్తి ఉన్న మమతా మోహన్ దాస్ ఈ పనికి సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.

మమతా మోహన్ దాస్ ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ను ప్రారంభించిన ఈ హీరోయిన్ ఇకపై వరుసగా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల నిర్మాణంకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా రంగం తనకు ఎంతో ఇచ్చింది. దానిలో కొంత అయినా ఇచ్చే ఉద్దేశ్యంతో తాను ఈ పని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సినిమాల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్నాను. పిల్లలు మరియు మహిళల కోసం నేను సినిమాలు తీయాలని భావిస్తున్నాను. కొత్త వారికి ప్రాముఖ్యత ఇస్తూ మహిళలకు ప్రాముఖ్యత ఇస్తానంటూ మమత చెప్పుకొచ్చింది. వరుసగా సినిమాలు తీస్తానంటూ మమతా మోహన్ దాస్ కొత్త వారికి ఛాన్స్ ఇస్తానంటూ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చిందట.