Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ యంగ్ హీరో అలా చేయడం లేదు.. ఎందుకని?

ఈ యంగ్ హీరో అలా చేయడం లేదు.. ఎందుకని?


ఈ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీలో నుండి ఏ హీరో కూడా ఓటిటి వేదికగా రెండు సినిమాలు విడుదల చేయలేదు. కేవలం యంగ్ హీరో సత్యదేవ్ నుండి మాత్రమే రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి 47డేస్ కాగా.. మరొకటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఈ రెండు సినిమాలు ఓటిటిలోనే విడుదలయ్యాయి. ఇక సత్యదేవ్ కంప్లీట్ చేసిన సినిమాలు కూడా ఓటిటిలోనే విడుదల కానున్నాయట. అయితే హీరోగా నటుడిగా తన ప్రతిభను ఇప్పుడిప్పుడే ప్రూవ్ చేసుకుంటున్న సత్యదేవ్.. మెగాస్టార్ చిరంజీవి నుండి ప్రశంసలు పొందడం విశేషమే. కానీ అసలు విషయం ఏంటంటే.. సత్యదేవ్ తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ గాని ఓ స్పెషల్ ఇమేజ్ గాని క్రియేట్ చేయడం లేదు. ఎందుకు అనేది ప్రశ్న.

యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ లేదా రాజ్ తరుణ్ లాంటి వాళ్లు రెండో సినిమాలతోనే మంచి హైప్ క్రియేట్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇమేజ్ అనే వాటిని సృష్టించారు. మరి సత్యదేవ్ ఎందుకు ప్రేక్షకుల పై అలాంటి ఎఫెక్ట్ చూపించలేక పోతున్నాడు? అంటే.. ఫ్యాన్ ఫాలోయింగ్ మెయింటైన్ చేయడం గాని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయడంలో.. సత్యదేవ్ అంత శ్రద్ధ చూపట్లేదని అలాంటివి క్రియేట్ చేయడంలో వీక్ అని పలువురు అభిప్రాయ పడుతున్నారట. సత్యదేవ్ సినిమాలు హిట్ అవుతున్నా.. ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయడానికి అర్హుడైన మరి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అంటే అదే కారణమా..! ఇండస్ట్రీలో కేవలం ఒక సినిమాతో ప్రేక్షకులలో భారీ హైప్ క్రియేట్ చేసిన హీరోలు ఉన్నారు.

వారు ఒక సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్.. వారి సినిమాలను సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ద్వారా ఫ్యాన్స్ పబ్లిసిటీ చేయడం వరకు చేస్తున్నారు. అలాగే ఎస్ఈఓ లను నియమించడం అప్పటి వరకు ఏదొక విధంగా ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొల్పడం.. సినిమాకి సంబంధించి అనేక ప్రోగ్రాంస్ జరపడం ఇలా వారి ప్రచారాలు చేస్తున్నారు. కానీ సత్యదేవ్ ఎందుకు ఇవేవి చేయడం లేదు. ఫ్యూచర్ లో ఇవే అతని కెరీర్లో అవకాశాలకు అడ్డు పడవచ్చు. ఒక హీరోగా.. ఒక మంచి నటుడుగా ప్రూవ్ చేసుకోవడం గురించి పక్కన పెడితే.. ఎల్లప్పుడూ జనాల దృష్టిలో ఉండటం.. భారీ హైప్ క్రియేట్ చేయడం ఈరోజుల్లో స్టార్ అయ్యే వారికి ఉపయోగపడతాయి. మరి ఈ యంగ్ హీరో ఇక పై ఈ విషయాల పై దృష్టి పెడతడేమో చూడాలి.