అన్ స్టాపబుల్ 2 : ఈసారి గెస్ట్ గా ఎవరొస్తున్నారంటే..!

0

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఓ రేంజ్ లో దూసుకెల్తుంది. ఓ పక్క సినిమాలతో సత్తా చాటుతున్న బాలయ్య హోస్ట్ గా కెరీర్ లో కొత్త టర్న్ తీసుకున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ అందుకోగా సీజన్ 2 కూడా అదే రేంజ్ లో వెళ్తుంది. ఎపిసోడ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్న ఈ సీజన్ లేటెస్ట్ ప్రోమో అదరగొడుతుంది. బాహుబలి ప్రభాస్ తో బాలయ్య ఇంటర్వ్యూ ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

ఇక త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ గ్యాప్ లో మరో సర్ ప్రైజ్ గెస్టులు ఈ షోలో అలరించనున్నారట. అన్ స్టాపబుల్ సీజన్ 2 లో నెక్స్ట్ ఎపిసోడ్ గెస్టులుగా సీనియర్ హీరోయిన్స్ జయసుధ జయప్రద వస్తున్నారట. ఎన్.టి.ఆర్ తో జత కట్టిన ఈ ఇద్దరు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రత్యక్షమవుతున్నారు. వీరిద్దరితో పాటుగా ప్రస్తుత హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఈ ఎపిసోడ్ లో రానుందట.

జయసుధ జయప్రద.. ఈ ఇద్దరికి తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు అప్పటితరం హీరోలందరితో కలిసి నటించారు ఈ ఇద్దరు. ఈ ఎపిసోడ్ లో ఆ నాటి జ్ఞాపకాలను నెమరేసుకునేలా చేస్తున్నారట. ఇక రాశి ఖన్నా తో కూడా బాలయ్య సరదాగా ఇంటర్వ్యూ ఉండబోతుంది. నాతో కలిసి నటిస్తావా అని రాశి ఖన్నాని బాలకృష్ణ అడిగేస్తాడని కూడా చెప్పొచ్చు.

అన్ స్టాపబుల్ హోస్ట్ గా బాలయ్య బాబు అదరగొట్టేస్తున్నారు. ఆయన స్టైల్.. సెన్సాఫ్ హ్యూమర్.. ఇలా అన్ని బాలయ్య ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి మూవీ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.