Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఉప్పెన ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే??

ఉప్పెన ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే??


ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి ఉప్పెన. చిన్నసినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టును నమోదు చేసింది. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఉప్పెన మూవీ.. సునామీ సృష్టించిందని చెప్పాలి. నిజానికి హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతిశెట్టి విలన్ విజయ్ సేతుపతి డైరెక్టర్ బుచ్చిబాబు.. వీరంతా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేశారు. కానీ డెబ్యూ మూవీనే సంచలనమైన విజయం అందుకోవడం అనేది మంచి విశేషమనే చెప్పుకోవాలి. అసలు ఉప్పెన సినిమాకు అంతటి క్రేజ్ రావడానికి కారణం సంగీతం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఉప్పెన సినిమాను ఎక్కడో నిలిపింది. అందుకే జనాలు ఎగబడి మరీ సినిమా చూసారు.

ప్రేమికులరోజు సందర్బంగా విడుదలైన ఉప్పెన సినిమాతో మెగాహీరో వైష్ణవ్ కన్నడ బ్యూటీ కృతిశెట్టి డైరెక్టర్ బుచ్చిబాబు ఒక్కసారిగా స్టార్స్ అయిపోయారు. అయితే విడుదలైన రెండు నెలల తర్వాత సినిమా టీవీలో ప్రసారం కాబోతుంది. స్టార్ మా ఛానల్లో ఉప్పెన సినిమాను ఏప్రిల్ 18న అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా యాజమాన్యం ట్విట్టర్ వేదికగా తెలిపింది. అలాగే ప్రముఖ ఓటిటి వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం టీవీలో ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి సినిమాను బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ సూపర్ హిట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. డైరెక్టర్ సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరించడం జరిగింది. ప్రేక్షకులు కూడా ఉప్పెన సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది. చూడాలి మరి ఉప్పెన ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో..!