విశేషంగా ఆకట్టుకుంటున్న ‘వి’ సాంగ్…!

0

నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”వి”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో ‘వి’ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన యాక్షన్ ప్యాకెడ్ ”వి” ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

కాగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా.. చూస్తున్నా చూస్తూనే ఉన్నా ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీమీదే తెలుసా.. వస్తున్నా వచ్చేస్తున్నా’ అంటూ సాగే ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్ – అమిత్ త్రివేది – అనురాగ్ కులకర్ణి ఈ మెలోడీని ఆలపించారు. హీరో హీరోయిన్ తమ మనసులోని భావాలు చెప్పుకుంటూ ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తున్నారు అనే నేపథ్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సాంగ్ లో నివేద థామస్ కాల్ చేసినట్లు.. సుధీర్ బాబు – నాని ఇద్దరూ రియాక్ట్ బయలుదేరినట్లు చూపించి.. చివరకి నివేద కాల్ చేసింది సుధీర్ బాబుకే అన్నట్లు విజువల్స్ చూపించారు. అద్భుతమైన ట్యూన్ కి మంచి సాహిత్యం తోడైన ఈ సాంగ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.