బుట్ట బొమ్మ `వీ` షేప్ జిమ్ వెరీ స్పెషల్

0

రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ జాబితా తిరగేస్తే అందులో టాప్ 10లో పూజా హెగ్డే పేరు ఉండాల్సిందే. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా.. జిమ్… యోగా సెషన్స్ ని అస్సలు స్కిప్ కొట్టదు. నిరంతరం 2 గంటల సమయం దీనికోసమే కేటాయిస్తుంది. ఇక అన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తూ చక్కని ఆహారం తీసుకుంటుంది కాబట్టి టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేయగలుగుతోందిట.

పూజా నిరంతరం తన వర్కవుట్లు సహా యోగా ఫోటోల్ని ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేస్తూనే ఉంది. ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీ షేప్ లో పూజా జిమ్ చేస్తున్న ఓ వీడియో నెటిజనుల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. “చానెలింగ్ మై ఇన్నర్ హ్యాపీ.. గో లక్కీ డాల్ఫిన్ డే.. భుజాలపైనా ఇతర సున్నిత భాగాలపై ఒత్తిడిని పెంచే ప్రత్యేక వర్కవుట్ ఇది“ అని పూజా తెలిపింది.

అల వైకుంఠపురములో చిత్రం తనకు బుట్ట బొమ్మ అన్న ఇమేజ్ ని ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ పూజా నటిస్తోంది. తదుపరి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలోనూ నాయికగా నటించనుంది.