Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘V’ మూవీని తెలివిగా వదిలించేసుకున్నారా…?

‘V’ మూవీని తెలివిగా వదిలించేసుకున్నారా…?


నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వి’ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి – నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రం ‘వి’ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్స్ లో విడుదల అవడం లేదని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత ‘V’ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయకపోవడమే మంచిదైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా నాని సినిమా అంటే ఆడియన్స్ కి మినిమమ్ గ్యారెంటీ అనే ఫీలింగ్ కలుగుతుంది. నాని గత చిత్రాలు చూసుకుంటే హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ‘వి’ చూసిన వారంతా నాని ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడని.. కెరీర్లో మైలురాయి లాంటి 25వ చిత్రానికి ఇలాంటి నేపథ్యాన్ని ఎలా ఎంచుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైలర్ లో టీజర్ లో ఏదో ఉందని అనుకునేలా చేసి చివరకి రొటీన్ రివేంజ్ డ్రామాని చూపించారు. ఇలాంటి సినిమా నాని కి కొత్త అయ్యుండొచ్చు కానీ ఆడియన్స్ ఇలాంటివి చాలా సినిమాలు చూసేసి ఉన్నారు. అందుకే ఈ సినిమా వారందరూ డిజప్పాయింట్ అయినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా ‘వి’ సినిమాని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేసిన అమెజాన్ వారు మళ్లీ మోసపోయారని అంటున్నారు. ‘వి’ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే 20 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. కానీ ‘వి’ ని నమ్ముకుని ఓటీటీ వారు సుమారు 33 కోట్ల వరకు ముట్టజెప్పారని ఓటీటీ వర్గాల సమాచారం. ఇక సినిమా బిజినెస్ విషయంలో తల పండిపోయిన దిల్ రాజు మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని లాక్ డౌన్ టైమ్ లో కూడా అమెజాన్ వారికి ‘వి’ ని ఎక్కువ రేటుకి అమ్మేసి లాభాలు తెచ్చుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ని ముందే గెస్ చేసిన ప్రొడ్యూసర్ తెలివిగా వదిలించేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ చేస్తున్నారు.