లవ్ లీ ఏం నవ్విందిలే.. ఆది పరేషానులే!

0

`లవ్ లీ` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శాండల్వుడ్ బ్యూటీ శాన్వి శ్రీవత్సవ. అందానికి అందం క్యూట్ లుక్ ఈ అమ్మడికి ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. దివంగత మహిళా దర్శకురాలు బి.జయ ఏరి కోరి మరీ ఈ క్యూటీని టాలీవుడ్ కి దిగుమతి చేశారు. ఆదికి శాన్వీకి తొలి బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు. ఆ తర్వాత సుశాంత్ సరసన కరెంట్ అనే చిత్రంలో నటించిన శాన్వి మంచు విష్ణు సరసన ఓ ఆఫర్ అందుకుంది.

కాలక్రమంలో సరైన విజయం దక్కక పూర్తిగా శాండల్వుడ్ కే అంకితమైంది. ఇటీవల తెలుగులో ఆశించిన ఆఫర్లు దక్కలేదు. ఇక సోషల్ మీడియాల్లో మాత్రం అభిమానులకు శాన్వీ ఫుల్ గా టచ్ లోనే ఉంది. నిరంతరం వేడెక్కించే ఫోటోలు వీడియోలతో విరుచుకుపడుతూ ఫాలోయింగ్ మాత్రం తగ్గనీకుండా జాగ్రత్త పడుతోంది.

శాన్వి గత ఆరు నెలలుగా క్వారంటైన్ లో ఉండిపోయిందిట పాపం. ఓవైపు షూటింగులు లేకపోవడంతో పూర్తిగా ప్రకృతి మాత ఒడిలోకి వెళ్లిపోయింది. కర్నాటక మారుమూల అడవుల్లో కొండలు కోనల్లో షికార్లు చేస్తూ వైరస్ నుంచి ఎస్కేప్ అవుతోంది మరి. ఇదిగో లేటెస్టుగా డీప్ రిజర్వుడ్ ఫారెస్ట్ లో నది గట్టున ఉన్న ఫామ్ హౌస్ నుంచి ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది.

కొండ కోనల్లో నదీతీరంలో స్లీపీ ఐస్ తో చిల్ చేస్తోంది లవ్ లీగా. శాన్వీ ట్రావెల్ గ్రమ్ లో అరుదైన ఫోటో ఇది. ఇక ఆ టైట్ ఫిట్ లుక్ తో కుర్రకారు గుండెల్ని గుల్ల చేస్తోంది లవ్ లీ గాళ్. లవ్ లీ ఈ ఫోటోలో ఇచ్చిన స్మైల్ కి తొలి చిత్ర హీరో ఆదినే కాదు ఎవరైనా పడిపోవాల్సిందే.