య‌ష్ రాజ్ బ్యూటీ బ్లాక్ క్యాట్ అవ‌తారం షాకిస్తోందిగా

0

యష్ రాజ్ ఫిలింస్ ఆస్థాన నాయిక వాణీకపూర్ ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవలి కాలంలో ఈ ఆరడుగుల బుల్లెట్టు వరుసగా క్రేజీ చిత్రాలకు సంతకాలు చేసి జరంత క్రేజీగా దూసుకెళుతోంది. హృతిక్- టైగర్ ష్రాఫ్ లతో కలిసి వార్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ సరైన టైమ్ లో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్సులు అందుకుందిట.

కెరీర్ ని పరుగులెత్తించాలంటే అందుకు తగ్గట్టు హీట్ పెంచాలన్న ఫార్ములాని వాణీ ఏమాత్రం లైట్ తీస్కోవడం లేదు. ఏజ్ లెస్ బ్యూటీగా గ్లామర్ ప్రపంచంలో సత్తా చాటేందుకు వాణీ అంతకంతకు సరికొత్త ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో వాణీ ఇన్ స్టా మాధ్యమంలో చెలరేగుతోంది. వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. మొన్నటికి మొన్న స్విమ్ సూట్ లో అగ్గి రాజేసింది.

తాజాగా బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో వెస్ట్రన్ స్టైలింగ్ తో కట్టి పడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది. వాణీ నెవ్వర్ బిఫోర్ లుక్ అంటూ అంతా పొగిడేస్తున్నారు. ఇక కెరీర్ సంగత చూస్తే..యశ్ రాజ్ ఫిలింస్ లోనే భారీ హిస్టారికల్ మూవీ `సంషేరా`లోనూ వాణీ కథానాయికగా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కించిన ఈ సినిమాని అంతే భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ ఉన్నా… కోవిడ్ వల్ల అది వాయిదా పడింది.