‘రంగ్ దే’ స్పెషల్ సీన్ బయటపెట్టిన వెన్నెలకిషోర్..!

0

టాలీవుడ్ యువహీరో నితిన్ చెక్ సినిమాను గతనెలలో విడుదల చేసాడు. ఇప్పుడు రంగ్ దే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయాడు. మార్చ్ 26న రంగ్ దే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి అన్నివిధాలా జనాల్లో సినిమాపై అంచనాలు పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు గ్యాప్ లేకుండా జరుపుతోంది రంగ్ దే బృందం. ఇటీవలే ప్రీ-రిలీజ్ వేడుకలు జరిపిన మేకర్స్.. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పై అంచనాలు భారీగా నెలకొల్పింది. అలాగే తాజాగా రంగ్ దే ట్రైలర్ కూడా సరదాగా సాగుతూ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే భారీ అంచనాలతో నితిన్ చెక్ సినిమా విడుదలై ప్లాప్ అయింది.

కానీ ఈసారి రంగ్ దే అలా కాదని చెప్పుకొచ్చాడు హీరో. అయితే తాజాగా రంగ్ దే లో వర్క్ చేసిన నితిన్ తో పాటు సీనియర్ యాక్టర్ నరేష్ వెన్నెల కిషోర్ ముగ్గురు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నరేష్ రంగ్ దే సినిమాలోని ఓ స్పెషల్ సీన్ గురించి గుట్టువిప్పారు. రంగ్ దే సినిమాలో ఓ న్యూడ్ సీన్ ఉందని రివీల్ చేసాడు. వెంటనే వెన్నెల కిషోర్ అందుకొని.. అవును. ఈ సినిమాలో ఓ న్యూడ్ సీన్ లో నటించాను. కానీ సీన్ డిమాండ్ చేసిందని చేసాను. అదేం చూడటానికి ఇబ్బందికరంగా ఉండదు. మేకర్స్ ఆ సీన్ చాలా అందంగా షూట్ చేశారు. కానీ సెన్సార్ వారు ఆ సీన్ తీసేసారని తెలిసింది’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి జనాలు షాక్ అవుతున్నారు. రంగ్ దే సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా.. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.