తమ్ముడు కోసం అన్న ఆరాటం…!

0

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటూనే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండని కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొరసాని’ సినిమాతో ఆనంద్ దేవరకొండ పరిచయమయ్యాడు. గతేడాది విడుదలైన ఈ పీరియాడిక్ లవ్ డ్రామా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. అయితే తమ్ముడిని ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబెట్టాలని ఆరాటపడుతున్న విజయ్.. ఇప్పుడు తన నిర్మాణంలోనే ఓ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నాడట.

కాగా విజయ్ దేవరకొండ ‘కింగ్ ఆప్ ది హిల్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘నేను మీకు చెప్తా’ అనే సినిమాని నిర్మించిన విజయ్.. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే హవా కాబోతోందని భావించిన విజయ్ తన తమ్మడు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేపించాడట. కరోనా మహమ్మారి పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే ఈ సిరీస్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ కి ‘అర్జున్ రెడ్డి’ సృష్టికర్త సందీప్ రెడ్డి వంగా లేదా ‘దొరసాని’ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.తమ్ముడు కోసం అన్న ఆరాటం…!