Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇన్ని వేలసంఖ్యలో ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి!!

ఇన్ని వేలసంఖ్యలో ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి!!


లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి సినీనటుడు సోనూసూద్.. అంటే ప్రస్తుతం దేశంలో ఆయన ఓ నటుడు మాత్రమే కాదు. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఎదురువారి ఆకలి తీర్చి కన్నీళ్లు తుడిచే మనస్తత్వం.. సేవాగుణం కలిగిన రియల్ హీరో. అయితే రీల్ లైఫ్ లో విలన్ రోల్స్ పోషించే సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. సోనూసూద్ మంచి మనసుతో చేస్తున్న పని ఇది. సోను వలస కార్మికుల కష్టాలు ఎరిగిన మనిషి. ఈ క్రమంలో ఉపాధి లేక చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ఆయన రవాణా సౌకర్యం కల్పించాడు. “పిల్లలు – వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం తరుక్కుపోయింది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లోని వలస కార్మికులకు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని సోనూసూద్ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఛారిటీ సహాయంతో ఇప్పటి వరకు కొన్ని వేల మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరినట్లు తెలుస్తుంది. కేవలం ఒక్కడి తపన.. సంకల్పం అంతమందికి బతుకు బాట చూపించింది. అయితే లాక్ డౌన్లో ఆయన చేయగలిగింది చేసాడు సోనుసూద్.

విదేశాలలో ఇరుక్కుపోయిన వేలాది మంది వలస కార్మికులు – భారతీయ విద్యార్థులకు తమ ఇళ్లకు చేరుకోవడానికి రవాణా ఏర్పాట్లు చేసాడు. నిరుపేదలకు ఉద్యోగాలు కల్పించడం – పేదలకు ఆర్థిక సహాయం అందించడం.. ఇలా అన్నీ తాను చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా అవసరమైన వారికి సాయం అందించే మార్గం ఎంచుకున్నాడు. అయితే తాజాగా.. సోను ట్విట్టర్ వేదికగా రోజూ తనకు సాయం చేయిమని వచ్చే రిక్వెస్ట్ సంఖ్యను బయటపెట్టాడు. మెయిల్ ద్వారా 1137 – ఫేస్ బుక్ ద్వారా 19000 – ఇంస్టాగ్రామ్ ద్వారా 4812 సందేశాలు.. ఇక ట్విట్టర్ ద్వారా 6741 హెల్పింగ్ రిక్వెస్టులు ఈరోజు వచ్చినట్లు తెలిపాడు. అయితే కేవలం సగటున ఒకరోజులో వచ్చే అభ్యర్థనలు ఇవ్వని చెప్పాడు సోను. ఇక చివరిగా ఓ రిక్వెస్ట్ కూడా చేసాడు. “వేల సంఖ్యలో సాయం కోరిన బాధితులు ఉన్నారు. వారందరికీ సాయం అందించడం కష్టం. కానీ నేను అందరికి నా వంతు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరికైనా సాయం అందకపోతే క్షమించగలరు” అని కోరాడు. కానీ అన్నీ వేలమంది సాయం కోరినా తను చేయడం ఆపను అన్నాడు కదా.. అందుకు సోను చాలా గొప్పవాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.