విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తా… వీడసలు మనిషేనా!

0

సోషల్మీడియా పుణ్యమా అని కొందరు దుర్మార్గులు బరితెగించి పోతున్నారు. సెలబ్రిటీల కూతుర్లను భార్యలను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇంత నీచంగా కామెంట్లు పెడుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఎస్కే టీం సరిగ్గా ఆడటంతో లేదని ధోని కూతురుని రేప్ చేస్తానంటూ ఓ నీచుడు సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా మరో దుర్మార్గుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. ‘విజయ్ సేతుపతి .. ముత్తయ్య మురళీధర్ బయోపిక్లో నటిస్తే అతడి కూతురును రేప్ చేస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై తీవ్ర దుమారం రేగుతున్నది. ‘800’ సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే ఇలాంటి బెదిరింపులకు కారణం.

విజయ్ ఈ సినిమాలో నటించొద్దని ఇప్పటికే తమిళ సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు ‘ఇటువంటి సినిమాలో నటించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు’ అంటూ నేరుగా ముత్తయ్య విజయ్కు లేఖ రాశాడు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు విజయ్ ప్రకటించాడు కూడా. అయినప్పటికీ బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. విజయ్పై పరోక్ష దాడులకు దిగుతున్నారు. ఈ వివాదంపై గాయని చిన్మయి స్పందించారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ ఫైర్ అయ్యింది.