Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎయిర్‌ పోర్ట్‌ లో కొత్త పెళ్లి కొడుకు

ఎయిర్‌ పోర్ట్‌ లో కొత్త పెళ్లి కొడుకు


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఇటలీలో వివాహం జరిగింది, హైదరాబాద్ లో వైభవంగా రిసెప్షన్ ను నిర్వహించడం జరిగింది. మెగా వారి ఇంట పెళ్లి సందడి ఇంకా పూర్తి అయ్యే ఉండదు. అప్పుడే వరుణ్‌ తేజ్ ముంబయి ఫ్లైట్‌ ఎక్కాడు. తన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది.

అందుకు గాను వరుణ్ తేజ్ నేడు ముంబై వెళ్లాడు. హనీమూన్ వెళ్లాల్సిన వరుణ్ తేజ్ ఇలా ముంబయి వెళ్లడం పట్ల పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వర్క్ పట్ల వరుణ్‌ తేజ్ కి ఉన్న డెడికేషన్‌ కి హ్యాట్సాఫ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా భయ్యా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించిన వరుణ్ తేజ్ యొక్క వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వరుణ్ తేజ్ లో ఇంకా పెళ్లి కల పోలేదు అని, కొత్త పెళ్లి కొడుకు మాదిరిగా మెరిసి పోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా ఈ వీడియోను షేర్ చేసి మాట్లాడుకుంటున్నారు.

ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమా విడుదలకు సరిగ్గా నెల సమయం మాత్రమే ఉంది. అంటే డిసెంబర్‌ 8వ తారీకున వరుణ్ తేజ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని సందీప్ ముడ్డ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. వరుణ్‌ పెళ్లి తర్వాత రాబోతున్న మొదటి సినిమా అవ్వడంతో అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. మరి ఆపరేషన్ వాలెంటైన్ ఎలా ఉంటుందో చూడాలి.