Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవన్ మరో రీమేక్ ఓకే చేస్తే ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..!

పవన్ మరో రీమేక్ ఓకే చేస్తే ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో..!


స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న వీరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే ఇటీవల పవన్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. PSPK28 పేరిట అనౌన్స్ చేసిన ఈ సినిమా క్రిష్ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే సెట్స్ పైకి వెళ్లనుందని అందరూ భావించారు. అయితే అదే సమయంలో పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహకాలు చేస్తున్నారు. దీంతో హరీష్ ప్రాజెక్ట్ ఇంకాస్త ముందుకు వెళ్లనుంది. ఇక ఈ సినిమా స్టోరీ నేపథ్యం ఇదేనంటూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచే గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి.

హరీష్ శంకర్ ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చే విధంగా స్టోరీ రెడీ చేసారట. అలానే పవన్ పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన క్యారక్టర్ డిజైన్ చేసారట. హీరో గెటప్ – డైలాగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టే హరీష్.. పవన్ ని మరోసారి అద్భుతంగా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఇందులో పవన్ కోసం తండ్రీకొడుకుల పాత్రలు సృష్టించాడట. రీమేక్ తో పవన్ కి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్.. ఇప్పుడు ఒరిజినల్ స్టోరీతో సాలిడ్ హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ కూడా మిగతా ప్రాజెక్ట్స్ కంటే ఈ సినిమాపై కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే హరీష్ మరో సినిమాని డైరెక్ట్ చేయకుండా దీనిపైనే వర్క్ చేస్తున్నాడు. వేరే దర్శకులకు మరియు వెబ్ సిరీస్ లకు స్టోరీస్ అందిస్తున్నాడు కానీ మరో మూవీ డైరెక్ట్ చేసే ఆలోచన చేయడం లేదు. కాకపోతే పవన్ ముందు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో మలయాళ రీమేక్.. క్రిష్ డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీ కంప్లీట్ చేసిన తర్వాతే హరీష్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈలోపు తక్కువ కాల్షీట్స్ లో కంప్లీట్ అయ్యే మరో రీమేక్ పవర్ స్టార్ ఓకే చేస్తే హరీష్ శంకర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.