Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆరున్నర అడుగుల బుల్లెట్టు ఎవరబ్బా?

ఆరున్నర అడుగుల బుల్లెట్టు ఎవరబ్బా?


మెగా హీరోలందరిలోకి ఎత్తయిన హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా వెంటనే వరుణ్ తేజ్ అనేస్తారు. అయితే ఇది నిజమా? అంటే కానేకాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు చెప్పే సమాధానం వేరుగా ఉంది. వరుణ్ తేజ్.. సాయి తేజ్.. వైష్ణవ్ తేజ్ .. వీళ్లలో ఎవరూ కాదు. ఇంకో కొత్త పేరు తెరపైకి వచ్చింది.

అతడే అకీరా నందన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడిగా అకీరా దూసుకు రాబోతున్నాడు. అతడు ఇప్పిటికే ఎదిగేశాడు. ఆరున్నరడుగుల బుల్లెట్టులా ఉన్నాడు ఈ కుర్రాడు. నిహారిక పెళ్లి వేడుక ఆద్యంతం అతడి హైట్ గురించిన చర్చే సాగుతోంది. ఫ్రేమ్ లోకి వస్తే ఏ ఇతర మెగా హీరో అతడి పక్కన కనిపించడం లేదు. అంత హైట్ కనిపిస్తున్నాడు. ప్రభాస్ తర్వాత మళ్లీ అంతటి హైట్ ఉన్న హీరోగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతాడా? అన్న చర్చా సాగుతోంది.

ప్రస్తుతం నూనూగు మీసాల రాకుమారుడిలా ఉన్న అకీరా ఇక హీరోగా బరిలో దిగుతాడా లేదా? అన్న మీమాంస కొనసాగుతోంది. మామ్ రేణు దేశాయ్ కానీ.. పవన్ కానీ ఏదీ తేల్చి చెప్పకపోవడంతో డైలమా నెలకొంది. అయితే అకీరా నందన్ పై ఇటీవల రకరకాల పుకార్లు షికారు చేశాయి. అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్ లో ఓ అతిథి పాత్రలో అకీరా నటిస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. కానీ దీనికి అధికారిక కన్ఫర్మేషన్ లేదు.

ప్రస్తుతం డాడీ పవన్ తో కలిసి నిహారిక పెళ్లి వేడుకలో సందడి చేస్తున్నాడు అకీరా. తాజాగా ఎరుపు కుర్తా నీలిరంగు ప్యాంటు ధరించిన అకీరా ఫోటో వైరల్ అవుతోంది. ఆ గ్రూప్ ఫోటోలో అల్లు అర్జున్ – రామ్ చరణ్- వరుణ్ తేజ్- సాయి ధరం తేజ్- అల్లు శిరీష్- వైష్ణవ్ తేజ్- కల్యాణ్ దేవ్ సహా మెగా హీరోలందరిలోకి పొడగరిగా కనిపిస్తున్నాడు అకీరా. అకీరా హీరోయిక్ లుక్ గురించి.. అతని ఆకర్షణీయమైన శరీరాకృతి ఒడ్డు పొడుగు గురించి మెగాభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.