ఉగాదికి బాలయ్య ట్రీట్ ఇవ్వనున్నాడా..??

0

నటసింహం నందమూరి బాలకృష్ణ.. గత కొన్ని సినిమాలుగా అభిమానులను వరుస ప్లాప్ లతో నిరాశపరుస్తున్నాడు. బాలయ్య చివరిగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రూలర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బకొట్టాయి. ప్రస్తుతం బాలయ్యకు హిట్టు తప్పనిసరి అయింది. ప్రస్తుతం బాలయ్య తనకు రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంతటి విజయాలను సాధించాయో విదితమే. బాలయ్య అభిమానులలో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అంతేగాక బాలయ్య ద్విపాత్రభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది.

బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బోయపాటి పై ఎనలేని నమ్మకంతో పాటు ప్రత్యేక అభిమానం కూడా ఉంది. ఎందుకంటే వేరే హీరోలను ఎలా చూపించినా బాలయ్యను మాత్రం ఓ రేంజ్ లో చూపిస్తాడని అంటున్నారు. బోయపాటి కాంబోలో.. బాలయ్య నడక.. మాట.. డైలాగ్స్.. యాక్షన్ అన్నింట్లో హైడోస్ ఉంటుంది. ఇక బిబి3 అని ప్రచారంలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఉగాది పండుగ సందర్బంగా విడుదల చేయాలనీ బాలయ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ దర్శకనిర్మాతలతో కూడా చర్చించాడట. ఎందుకంటే బాలయ్యకు సంప్రదాయం ముహుర్తాల సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు పండుగలకు దేవుళ్ళకు మిస్ అవ్వకుండా పూజలు శుభాకార్యాలు చేస్తుంటారు బాలయ్య. అందుకే రాబోయే తెలుగు పండుగ ఉగాది కాబట్టి ఆ రోజే సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని భావించి.. ఉగాది పండుగ లోపు సినిమా కంప్లీట్ చేయాలనీ టీమ్ ను ఆదేశించాడని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి బాలయ్య బోయపాటిలు ఉగాదికి ట్రీట్ ఇస్తారేమో..!!