ఫెమీనా కవర్ పై దీపిక కిల్లింగ్ లుక్

0

రణతంబోర్ అడవిలో భర్త రణవీర్ సింగ్ తో కలిసి నూతన సంవత్సర వేడుకల్ని సెలబ్రేట్ చేసిన తరువాత దీపిక పదుకొనే ముంబై నగరానికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం తన క్రేజీ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల తన పోస్ట్ లన్నింటినీ ఇన్ స్టాగ్రామ్ నుండి తొలగించిన దీపిక తన అభిమానులతో తాజా ఫోటోషూట్లను పంచుకుంటున్నారు.

ఎవ్వర్ లేటెస్ట్ ఫెమినా కవర్ పేజీని దీపిక షేర్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ గా మారింది. బ్లూ లుక్ లో డిప్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. కవర్ పేజీలో బ్లూ బ్లేజర్ లుక్ ప్రత్యేకం అని అభిమానులు పొగిడేస్తున్నారు.

తన అభిమానులతో చిత్రాన్ని పంచుకుంటూ డిపి ఇన్ స్టాగ్రామ్ లో ఏమని రాసారు అంటే.. “నేను ఒక చిన్నారిగా ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు `ఫెమినా ఇండియా` నా మదర్ చదివిన ఏకైక మ్యాగజైన్. టైంలెస్ & ఐకానిక్! ఈ క్వాలిటీకి ధన్యవాదాలు!“ అని వ్యాఖ్యను జోడించారు.

దీపిక కెరీర్ సంగతి చూస్తే.. ప్రస్తుతం ఆరు చిత్రాలతో ఫుల్ బిజీ. హృతిక్ రోషన్ తో కలిసి తన తదుపరి ప్రాజెక్ట్ ఫైటర్ ను ఇటీవల ప్రకటించిన దీపిక ఆసక్తికరమైన ప్రాజెక్టుల సుదీర్ఘ జాబితాను కలిగి ఉంది. ఇటీవలే సిద్ధాంత్ చతుర్వేది- అనన్య పాండేలతో కలిసి షకున్ బాత్రా తాజా ప్రాజెక్ట్ షూటింగ్ లో దీపిక బిజీగా ఉంది. షారుఖ్ ఖాన్ సరసన పఠాన్.. ప్రభాస్- నాగ్ అశ్విన్ జోడీ పాన్ ఇండియా బహుభాషా చిత్రం.. అలాగే `ది ఇంటర్న్` హిందీ రీమేక్ .. `మహాభారతం` సినిమాలోనూ నటించనుంది.

దీపిక ఈ సంవత్సరం భారీ చిత్రాలతో బిజీగా ఉంటూనే.. బ్రాండ్ ఎండార్స్ మెంట్ లతోనూ అంతే తీరిక లేకుండా ఉండనుంది. అందుకే ప్రస్తుతానికి బెంగళూరులో నివసించే ఆమె తల్లిదండ్రులు .. సోదరితో ఎక్కువ సమయం గడిపేస్తోందట.