Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవన్ కళ్యాణ్ నిర్మాతగా ‘వరుణ్ తేజ్’ సినిమా రాబోతుందా..??

పవన్ కళ్యాణ్ నిర్మాతగా ‘వరుణ్ తేజ్’ సినిమా రాబోతుందా..??


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ రాజకీయాల తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పవర్ ఫుల్ లాయర్ పాత్రతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రోజురోజుకి అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సూపర్ హిట్ పింక్ సినిమా రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. ఈ సినిమాలో శృతిహాసన్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి పవర్ స్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ఇక తాజాగా వకీల్ సాబ్ టీజర్ జనవరి 14న విడుదల కాబోతుందని ప్రకటించే సరికి పవన్ కళ్యాణ్ అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అయింది.

ఇదే ఊపులో మరో తాజా వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవర్ స్టార్ మరోసారి నిర్మాతగా మారబోతున్నాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరిట ఆల్రెడీ సొంత బ్యానర్ ఉందనేది విదితమే. ఇదివరకు ఈ బ్యానర్ పై సర్దార్ గబ్బర్ సింగ్ చల్ మోహన్ రంగా లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసాడు పవన్. అయితే తాజాగా మెగాహీరో వరుణ్ తేజ్ తో ఓ సినిమా నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల కాటమరాయుడు సినిమాలు తీసిన డాలీ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని సినీవర్గాలు కోడైకూస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో పవన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. అందుకే ఇప్పుడు మళ్లీ నిర్మాణం వైపు దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం.