టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సైలెంట్ అయిపోయాడు..!

0

టాలీవుడ్ లో హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన టాలెంటెడ్ నటుడు అవసరాల శ్రీనివాస్. ‘అష్టా చమ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవసరాల.. ‘ఊహలు గుస గుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానందా’ అనే సినిమా తెరకెక్కించాడు. దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్న తరువాత కూడా శ్రీనివాస్.. నటుడిగా సెలక్టివ్ గా సినిమాలు – వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ మధ్య ఎందుకో అవసరాల శ్రీనివాస్ అటు నటుడిగా ఇటు దర్శకుడిగా సైలెంట్ అయిపోయాడు. గతేడాది ‘ఊరంతా అనుకుంటున్నారు’ ‘కథనం’ సినిమాల్లో నటించిన అవసరాల.. ఈ ఏడాది ‘నిశ్శబ్దం’ చిత్రంలో కనిపించాడు. అయితే ఈ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించడంతో అసలు అవసరాల ‘నిశబ్దం’లో ఉన్నాడా అనే డౌట్ వ్యక్తం చేశారు.

అలానే డైరెక్టర్ గా యువ హీరో నాగశౌర్యతో ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ పేరుతో తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ ను స్టార్ట్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా షూటింగ్ 50 శాతం కంప్లీట్ అయింది. అయితే యూఎస్ఏ షెడ్యూల్ ప్లాన్ చేయగా వీసా ప్రాబ్లమ్ తో కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అదే క్రమంలో కరోనా మహమ్మారి రావడంతో విదేశాల్లో చిత్రీకరణకు వీలు లేకుండా పోయింది. ఈ సినిమాని పక్కన పెట్టలేదని మేకర్స్ చెప్తున్నప్పటికీ.. ఈ గ్యాప్ లో ఇప్పటి వరకు మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు శౌర్య నాలుగు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టి శరవేగంగా షూటింగ్స్ చేసేస్తున్నాడు. దీంతో అవసరాల శ్రీనివాస్ ప్రాజెక్ట్ పై మళ్ళీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. మరి కమెడియన్ గా హీరోగా డైరెక్టర్ గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్న అవసరాల శ్రీనివాస్ మళ్ళీ లైన్ లోకి వస్తాడేమో చూడాలి.