ప్రభాస్ కి జోడీగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ”ఆదిపురుష్” అనే పాన్ ఇండియా సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇతిహాస రామాయణం నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’ గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నిత్యం ఏదొక గాసిప్ తో ఈ సినిమా పేరు వార్తల్లో న నిలుస్తోంది. ముఖ్యంగా ‘సీత’ పాత్రలో నటించే హీరోయిన్ విషయంలో ఈ రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘ఆదిపురుష్’ లో నటించే హీరోయిన్ విషయంలో అనేకమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అనుష్క శర్మ – కీర్తి సురేష్ – కృతిసనన్ – కియారా అద్వానీ.. ఇలా చాలామంది పేర్లు చర్చకు వచ్చాయి. కానీ ఇంతవరకు ‘సీత’ పాత్రలో ఎవరు కనిపిస్తారు అన్నది మాత్రం తేలలేదు. ఈ క్రమంలో లేటెస్టుగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రభాస్ కి జోడీగా నటించనుందనే వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ అనే చిత్రంలో నటిస్తున్న అనన్యపాండే ని ‘ఆదిపురుష్’ కోసం సంప్రదిస్తున్నారని అంటున్నారు. మరి మేకర్స్ చివరకు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి. కాగా ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ మూవీ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆదిపురుష్’ ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.