కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వందల సినిమాలు ఆగిపోయాయి. హాలీవుడ్ లో వందల కోట్ల తో నిర్మాణం జరిగిన సినిమాలను సైతం విడుదల వాయిదా వేశారు. వచ్చే ఏడాది మొత్తం కూడా పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే తాము నిర్మిస్తున్న సినిమాలు అన్ని కూడా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయడంతో పాటు అదే సమయంలో ఓటీటీలో కూడా విడుదల […]
‘మీటూ’ వివాదం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో కోరిక తీర్చితేనే ఆఫర్లు ఇస్తామంటూ సినీ పరిశ్రమపై వర్ధమాన నటీమణులు దుమ్మెత్తిపోశారు. అలాంటి మోసానికి గురైన ఓ టెలివిజన్ నటి ఓ ప్రముఖుడి బండారాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆయూష్ తివారీపై ఓ టీవీ నటి తీవ్రమైన ఆరోపణలు తాజాగా చేసింది. ఆఫర్లు ఇస్తామంటూ ఆమెను ఓ దర్శకుడు వాడుకున్నాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. నాపై పలుమార్లు […]
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని మంగళవారం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని మొక్కుకున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎఫ్ -2 సినిమా గ్రాండ్ సక్సెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కు కథ సిద్ధమైంది. ఎఫ్ -3 సినిమాలోనూ వెంకటేష్ వరుణ్ తేజ్ లే హీరోలుగా నటించనున్నారు. దిల్ రాజే నిర్మించనున్నారు. లాక్ […]
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5’ వేదికగా విడుదలైన క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ ఫిల్మ్ ”మేకసూరి”. పల్లెటూరి వాతావారణంలో ఫ్యాక్షన్ పగ ప్రతీకారాల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ రెండు భాగాలుగా వచ్చింది. రెండు పార్ట్స్ కూడా ఓటీటీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇక ‘మేకసూరి’ ని డైరెక్ట్ చేసిన త్రినాథ్ వెలిశిల ను ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు విమర్శకులు సైతం అభినందిస్తున్నారు. ఒక్క వెబ్ మూవీ తో టాక్ […]
టాలీవుడ్ లో హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన టాలెంటెడ్ నటుడు అవసరాల శ్రీనివాస్. ‘అష్టా చమ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవసరాల.. ‘ఊహలు గుస గుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానందా’ అనే సినిమా తెరకెక్కించాడు. దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్న తరువాత కూడా శ్రీనివాస్.. నటుడిగా సెలక్టివ్ గా సినిమాలు – వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ మధ్య ఎందుకో అవసరాల శ్రీనివాస్ అటు […]
వరుస ఫ్లాపుల తరువాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. ఇటీవల శర్వా భారీ అంచనాలు పెట్టుకున్న పడి పడి లేచే మనసు రణరంగం జాను చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. `జాను` షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురైన శర్వా ఆ తరువాత సర్జీరీ కోసం కొంత విరామం తీసుకుని నటిస్తున్న చితం `శ్రీకారం`. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై శర్వా భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ మూవీతో […]
బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత దానిని కశ్యప్ ఖండించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కంగనా రనౌత్ రంగంలోకి దిగి అనురాగ్ కు ఆ తరహాలో ‘చాలా సామర్థ్యం’ ఉందని వ్యాఖ్యానించడం అగ్గి రాజేస్తోంది. అతను తన సొంత ట్యాలెంటుతో ఎప్పుడూ ఏదీ పొందలేదని అతని భాగస్వాములందరికీ నమ్మకద్రోహం చేశాడని పాత కక్షల్ని తిరిగి రగిలించింది క్వీన్. “నాకు తెలిసినంతవరకు అనురాగ్ పలువురిని […]
నాకు ఫోన్ కాల్ దూరంలో కథానాయికలు ఉన్నారు.. నన్ను నమ్మితే ఆఫర్లే ఆఫర్లు! అంటూ గదిలో గడుసుగా ప్రవర్తించాడు! అంటూ అందాల కథానాయిక పాయల్ ఘోష్ #MeToo వేదికగా అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్టర్ పై ఆరోపించడం సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యల పై అనురాగ్ స్పందించారు. పాయల్ ఘోష్ #MeToo ఆరోపణ పై స్పందిస్తూ.. కంగనా రనౌత్ తన ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తోందని పరోక్షంగా ఆరోపించారు అనురాగ్. పాయల్ ఘోష్ […]
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మాతృమూర్తి కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో అమ్మను కాబోతున్నానంటూ ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్ తో కనిపించిన అనుష్క శర్మ ఫొటో విరాట్ కోహ్లీ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించిన ఓ మహిళా జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యంగ్యంగా విమర్శలు గుప్పించింది. అనుష్క మీ గుర్రాలకు కాస్త కళ్లెం వేయండి. మీరు తల్లి మాత్రమే కాబోతున్నారు. ఇంగ్లాండ్ […]
మెగా ఫ్యామిలీ నుంచి నటవారసుడు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ .. కన్నడ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తొలి చిత్రం `ఉప్పెన` డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారమవుతోంది. ఈ మూవీ టీజర్.. ట్రైలర్.. సాంగ్ ప్రోమోస్ ప్రతిదీ యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. `ఉప్పెన` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ క్యారెక్టర్ […]
గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. వకీల్ సాబ్ (పింక్ రీమేక్) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక వరుసగా నాలుగైదు సినిమాలకు పవన్ కమిటవ్వడం ఆసక్తిని రేకెత్తించింది. వరుసగా దర్శకరచయితలు వినిపిస్తున్న కథలు విని వేగంగా డెసిషన్స్ తీసుకోవడం చూస్తుంటే పవన్ అభిమానులు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ లో నటించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. సాగర్ చంద్ర అందించిన స్క్రిప్ట్ […]
కొన్ని ప్రకటనలు అనవసర టెన్షన్ ని పెంచుతాయి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా చివరికి విషయంలో క్లారిటీ లేకుండా పోతుంది. తాజాగా బాలీవుడ్ మీడియా ముందు ఓంరౌత్ దూకుడు చూస్తుంటే ప్రభాస్ 21 దర్శకుడు ఎవరు? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇంతకీ తానాజీ దర్శకుడు ఓం రౌత్ ముంబై మీడియా ముందు ఏమని ప్రకటించాడు? అంటే.. ప్రభాస్ తో తన సినిమా `ఆదిపురుష్ 3డి` జనవరి 2021 నుంచి మొదలవుతుందని అనౌన్స్ చేసేశాడు. దీంతో ఇటువైపు నాగ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాని ప్రకటించారు మహేష్. తన కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న […]