శ్రీకారం డైరెక్టర్ పై శర్వా ప్రెజర్ !

0

వరుస ఫ్లాపుల తరువాత శర్వానంద్ నటిస్తున్న చిత్రం `శ్రీకారం`. ఇటీవల శర్వా భారీ అంచనాలు పెట్టుకున్న పడి పడి లేచే మనసు రణరంగం జాను చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. `జాను` షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురైన శర్వా ఆ తరువాత సర్జీరీ కోసం కొంత విరామం తీసుకుని నటిస్తున్న చితం `శ్రీకారం`. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీపై శర్వా భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ ని సాధించాలని గట్టి పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. కిషోర్ . బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే తిరుపతిలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయాలని శర్వా డైరెక్టర్ మీద ప్రెజర్ పెట్టి మరీ సినిమా చేస్తున్నాడట.

ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరుకు షెడ్యూల్ అక్కడే షూటింగ్ జరగనుందని టీమ్ చెబుతోంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్లాలనే కసితో శర్వా వున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ శర్వానంద్ కేర్ తీసుకుంటున్నారట. దీంతో కొత్త దర్శకుడు కిషోర్ కి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. చాలా ప్రెషర్ ఫీలవుతున్నాడట.