అనుష్కను అవమానించిన ఆమెపై డైరెక్టర్ పంచ్ ఇలా!!

0

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మాతృమూర్తి కాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో అమ్మను కాబోతున్నానంటూ ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బేబీ బంప్ తో కనిపించిన అనుష్క శర్మ ఫొటో విరాట్ కోహ్లీ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించిన ఓ మహిళా జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యంగ్యంగా విమర్శలు గుప్పించింది. అనుష్క మీ గుర్రాలకు కాస్త కళ్లెం వేయండి. మీరు తల్లి మాత్రమే కాబోతున్నారు. ఇంగ్లాండ్ కు మహారాణి కావడం లేదంటూ మీనా దాస్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అమె ఓ పత్రికాధిపతి.. అంతే కాకుండా కర్ణాటక విశ్వహిందూ పరిషత్ కు విప్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అనుష్కపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా మంది నెటిజనులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వ్యాఖ్యలపై మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి ఘాటుగా స్పందించారు. చాలా అవమానకరంగా వున్నాయని కౌంటర్ ఇచ్చారు. ఇంగ్లాంగ్ రాణి కావడం కంటే మాతృత్వం అనేది పెద్ద ఆనందాన్నిస్తుందన్నారు.

ఒక మహిళా జర్నలిస్టు నుంచి ఈ తరహా అవమానకర వ్యాఖ్యలు రావడం బాధాకరం. ఇంగ్లాండ్ రాణి కావడం కంటే ఓ మహిళకు మాతృమూర్తిగా మారడమే గొప్ప ఆనందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతీ మహిళా ఒక మహరాణే. సంతోషం వెల్లివిరిసిన ప్రతీ ఇల్లూ ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడానికి ముందు అందరిలాగే ఓ సాధారణ మహిళ. ఆమె తన మాతృత్వం గురించి షేర్ చేసుకోవడానికి ఆమెకు పూర్తి హక్కు స్వేచ్ఛ వుంది` అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మారుతి. మారుతి స్పందనకు చాలా మంది సెలబ్రిటీలు సపోర్ట్గా నిలిచారు. మారుతిపై లావణ్య త్రిపాఠి ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు.