నాకు ఫోన్ కాల్ దూరంలో కథానాయికలు ఉన్నారు.. నన్ను నమ్మితే ఆఫర్లే ఆఫర్లు! అంటూ గదిలో గడుసుగా ప్రవర్తించాడు! అంటూ అందాల కథానాయిక పాయల్ ఘోష్ #MeToo వేదికగా అనురాగ్ కశ్యప్ లాంటి స్టార్ డైరెక్టర్ పై ఆరోపించడం సంచలనమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యల పై అనురాగ్ స్పందించారు.
పాయల్ ఘోష్ #MeToo ఆరోపణ పై స్పందిస్తూ.. కంగనా రనౌత్ తన ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తోందని పరోక్షంగా ఆరోపించారు అనురాగ్. పాయల్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కానీ ఆయన కంగనా పేరు పెట్టకపోయినా అతను బచ్చన్ కుటుంబాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు పాయల్ కి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. జయ బచ్చన్-కంగనా రనౌత్ ల పేర్లను ఈ గొడవలోకి లాగారాయన. ఒక మహిళ (కంగనా కావచ్చు) ఇతర మహిళలు (ఘోష్) తన పై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ఈ గొడవలోకి లాగారని ఆరోపించడం ద్వారా అనురాగ్ తెలివిగా తన ట్వీట్లను ప్రారంభించాడు.
పాయల్ ఘోష్ ఆరోపించిన వెంటనే కశ్యప్ ఆత్మ రక్షణ కోసం ట్విట్టర్ లో కౌంటర్లు స్టార్ట్ చేశారు. హిందీలో వ్యాఖ్యానిస్తూ.. “వావ్ మీరు నన్ను చాలా కాలం నుండి సైలెంట్ చేయడానికి ప్రయత్నించారు. సమస్య లేదు. నన్ను నిశ్శబ్దంగా ఉంచేందు కోసం.. మీరు చాలా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇతరులు కూడా ఈ అబద్ధంలో చిక్కుకున్నారు. మేడమ్ నేను చెప్పదలచుకున్నది నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి“ అంటూ అనురాగ్ `ఆధారం` అన్న పాయింట్ ను వాడారు.
నాపై ఆరోపిస్తూ నా నటులను (తాప్సీ పన్నూ) బచ్చన్ కుటుంబాన్ని లాగడం తదుపరి స్థాయి మేడమ్.. నేను రెండుసార్లు వివాహం చేసుకున్నాను. అది నేరం అయితే.. నేను వారిని చాలా ప్రేమిస్తున్నానని అంగీకరిస్తాను. నా మొదటి లేదా రెండవ భార్య .. ప్రేమికులను కలిసినా ఒక నిందితుడిలా ప్రవర్తించను! ఇంకా ఏమి జరుగుతుందో చూద్దాం“ అంటూ అనురాగ్ ఎమోషన్ అయ్యారు.
ఇటీవల కంగన యోధురాలిని అన్న వ్యాఖ్యపై అనురాగ్ కౌంటర్ తెలిసినదే. నలుగురు గ్యాంగ్ ని తీసుకెళ్లి చైనాతో యుద్ధం చేయమని అనురాగ్ కంగనాను కోరారు. ఆ తర్వాత ఒలింపిక్స్ లో చేరమని కంగన కౌంటర్ వేసింది. అతను ఎప్పుడూ తెలివితక్కువవాడని అంది. ఈ గొడవ తర్వాత పాయల్ ఘోష్ వేధింపుల ఆరోపణలు సంచలనం అయ్యాయి.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
