బూతు కంటెంట్ నే నమ్ముకుంటున్న ఫిలిం మేకర్స్…!

0

‘అల్లరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవిబాబు.. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ డైరెక్టర్స్ అందరిలో నేను డిఫరెంట్ అని చాటి చెప్పాడు. క్రమంలో ‘అమ్మాయిలు అబ్బాయిలు’ ‘పార్టీ’ ‘సోగ్గాడు’ ‘అనసూయ’ ‘నచ్చావులే’ ‘అమరావతి’ ‘మనసారా’ ‘నువ్విలా’ ‘లడ్డుబాబు’ ‘అవును’ ‘అవును 2’ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అయితే ఈ మధ్య రవిబాబు సినీ ఫార్ములా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. రవిబాబు లాస్ట్ రెండు సినిమాలు ‘అదుగో’ ‘ఆవిరి’ లను ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన రవిబాబు.. ఇప్పుడు యూత్ ని టార్గెట్ చేస్తూ ‘క్రష్’ అనే చిత్రంతో వస్తున్నాడు. నూతన నటీనటులతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని రవిబాబు తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నిర్మించాడు.

ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ‘ఫస్ట్ పీప్’ పేరుతో 3 నిమిషాల 13 సెకన్ల నిడివి గల ఓ స్పెషల్ వీడియోని వదిలాడు. ‘క్రష్’ ఫస్ట్ పీప్ లో టీనేజ్ సెక్స్ గురించి.. వారిలో కలిగిన ఫీలింగ్స్ గురించి.. కుర్రాళ్ళు తమ ప్రియురాళ్ళతో చేసే రొమాన్స్ గురించి రవిబాబు డబుల్ మీనింగ్ డైలాగ్స్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి నేర్పించాడు. రవిబాబు గతంలో యూత్ ఫుల్ సినిమాలు తీసినప్పటికీ ఆయన నుంచి ఈ రేంజ్ లో బూతు డైలాగ్స్ తో సినిమా రావడం ఇదే మొదటిసారి. అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా స్టార్ట్ అయిన తర్వాత తెలుగులో కూడా అడల్ట్ సినిమాలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ఎమ్మెస్ రాజు లాంటి ఫిలిం మేకర్స్ కూడా అడల్ట్ కంటెంట్ ని ఆశ్రయిస్తున్నారు. టాలీవుడ్ ప్రస్తుతం ఓటీటీలను నమ్ముకొని తీస్తున్న సినిమాలన్నీ దాదాపుగా అడల్ట్ కంటెంట్ తో వస్తున్నవే. తెలుగులో అడల్ట్ సినిమాల కాలం ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో టాలీవుడ్ కాస్త అడల్ట్ వుడ్ అయిపోతుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.