పెళ్లి చేసుకుంటానని రెండేళ్లుగా రేప్.. డైరెక్టర్ పై టీవీ నటి ఆరోపణ

0

‘మీటూ’ వివాదం ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.. బాలీవుడ్ లో ఇటీవల కాలంలో కోరిక తీర్చితేనే ఆఫర్లు ఇస్తామంటూ సినీ పరిశ్రమపై వర్ధమాన నటీమణులు దుమ్మెత్తిపోశారు. అలాంటి మోసానికి గురైన ఓ టెలివిజన్ నటి ఓ ప్రముఖుడి బండారాన్ని బయటపెట్టింది.

బాలీవుడ్ లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆయూష్ తివారీపై ఓ టీవీ నటి తీవ్రమైన ఆరోపణలు తాజాగా చేసింది. ఆఫర్లు ఇస్తామంటూ ఆమెను ఓ దర్శకుడు వాడుకున్నాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని.. నాపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. నాకు ఇష్టం లేకపోయినా రెండేళ్లుగా నన్ను బలవంతంగా వాడుకుంటూ కోరికలు తీర్చుకున్నాడని ఆ నటి బాంబు పేల్చింది.

టీవీ నటి ఫిర్యాదు మేరకు ఆయూష్ తివారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండడం వల్ల అరెస్ట్ చేయడానికి దొరకలేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ఇక పోలీసులు లేట్ చేశారని.. తనకు న్యాయం జరుగుతుందో లేదోనని టీవీ నటి ఆవేదన వ్యక్తం చేసింది. నవంబర్ 16న ఫిర్యాదు చేస్తే నవంబర్ 26న కేసు నమోదు చేశారని ఆమె తెలిపారు. తన పేరు వివరాలు వెల్లడించానికి మాత్రం నిరాకరించింది.