రాశికి రంగమ్మత్త చీరకట్టు నచ్చలేదట

0

రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్ర ఎంతగా పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలోని ఆ పాత్రను అనసూయ చేసిన విషయం తెల్సిందే. అనసూయ ఆ పాత్ర చేసిన తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా టర్న్ అయ్యింది. వరుసగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసే అవకాశం దక్కించుకుంది. హీరోయిన్ సమంత పాత్ర స్థాయిలో అనసూయకు గుర్తింపు దక్కింది. అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు మొదట పలువురు సీనియర్ హీరోయిన్ లను దర్శకుడు సుకుమార్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకరు రాశి. తనకు రంగమ్మత్త ఆఫర్ వచ్చిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి అన్నారు.

ఆమె మాట్లాడుతూ.. రంగమ్మత్త పాత్ర గురించి నాకు చెప్పిన సమయంలో ఎగ్జైట్ అయ్యాను. అయితే చీర కట్టు విషయమై నాతో చెప్పినప్పుడు అందుకు నో చెప్పాను. మోకాళ్ల వరకు చీరను కట్టాలని అన్నప్పుడు నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. రంగమ్మత్త పాత్ర నచ్చినా ఆమె చీర కట్టు నచ్చక పోవడం వల్లే నేను ఆ పాత్రకు చివరి నిమిషంలో నో చెప్పాల్సి వచ్చిందని ఈ సందర్బంగా రాశి పేర్కొంది. గతంలో ఎన్నో హాట్ పాత్రల్లో నటించిన రాశి చీర కట్టు విషయంలో మంచి పాత్రను వదులుకోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.