బాలీవుడ్ క్వీన్ కియారా.. జెండా పాతినట్టేనా..!

0

బాలీవుడ్ కు కొత్త రాణీ రాబోతోందా? అంటే.. అవుననే ఆన్సర్ వస్తోంది అన్నివైపుల నుంచి! ఇంతకీ.. ఆ క్వీన్ ఎవరు అంటే.. కియారా అద్వానీ! అవును.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. బీటౌన్ లో జెండా పాతినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కియారా జపం చేస్తోంది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ రూ.300 కోట్లు వసూలు చేసింది. ‘గుడ్ న్యూస్’ సుమారు రూ.250 కోట్లు రాబట్టింది. దీంతో.. ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కియారా కిట్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఏ రెండుమూడు హిట్ కొట్టినా.. అమ్మడి రేంజ్ వేరే లెవల్లో ఉండడం ఖాయమని అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

షేర్షాః ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన చిత్రం ‘షేర్షా’. టైటిల్ రోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విక్రమ్ బాత్రా భార్యగా కియారా కనిపించనున్నారు. అయితే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కరోనా వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు.

కర్రమ్ కుర్రమ్ః ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తోంది కియారా. ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశుతోష్ డైరెక్షన్ విభాగంలో అసిస్టెంట్లుగా పనిచేసిన చేసిన గ్లెన్ బరెట్టో అంకుష్ మోహ్లా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొంది అప్పడాలు తయారు చేసుకుని జీవితాన్ని సాగించే కొందరు స్త్రీల కథతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ వేసవిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

భూల్ భులెయ్యా 2ః అక్షయ్ కుమార్ హీరోగా 2007లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘భూల్ భులెయ్యా’. ఇన్ని సంవత్సరాల తర్వత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అయితే.. సీక్వెల్ లో మాత్రం అక్షయ్ నటించట్లేదు. ఈ సీక్వెల్లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. నవంబర్ 19న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.

జగ్ జగ్ జీయోః ఈ చిత్రంలో వరుణ్ ధావన్ తో జత కట్టబోతోంది కియారా. రాజ్ మెహతా తెరకెక్కిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వరుణ్ ధావన్ కియారా వైఫ్ అండ్ హజ్బెండ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ నీతూ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూట్ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మిస్టర్ లేలేః విక్కీ కౌశల్ కియారా అద్వానీ ఈ సినిమాలో జంటగా నటించబోతున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మిగిలిన నటీనటులు టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇవి కాకుండా.. మరో సినిమా కూడా చర్చల దశలో ఉందని టాక్. దీంతోపాటు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కిస్తున్న ‘యానిమల్’లో కియారా అతిథి పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్లో మరో సినిమాలోనూ కనిపించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకు కియారాను పరిశీలిస్తున్నారన్నట్టు సమాచారం. ఈ విధంగా జోరు చూపిస్తున్న కియారా అద్వానీ.. త్వరలోనే బాలీవుడ్ క్వీన్ అయ్యే అవకాశం మెండుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.