Templates by BIGtheme NET
Home >> GADGETS >> Airtel WiFi Callingను సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉంటే మీరు లక్కీనే!

Airtel WiFi Callingను సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉంటే మీరు లక్కీనే!


జియో తన వైఫై కాలింగ్ ను అధికారికంగా ప్రకటిస్తూ దాన్ని సపోర్ట్ చేసే దాదాపు 150 స్మార్ట్ ఫోన్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడా చాలా వేగంగా స్పందించింది. తన వైఫై కాలింగ్ ను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను పెంచి కొత్త జాబితాను విడుదల చేసింది. మొదట కేవలం నాలుగు కంపెనీలకు చెందిన అతి కొద్ది స్మార్ట్ ఫోన్లనే ఎయిర్ టెల్ ప్రకటించింది. అయితే తర్వాత జియో ఒకేసారి 150 స్మార్ట్ ఫోన్ల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడా 16 బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లకు ఈ ఫీచర్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఏయే బ్రాండ్లలో ఏయే స్మార్ట్ ఫోన్లకు ఎయిర్ టెల్ ఈ ఫీచర్ అందించిందో ఓ లుక్కేయండి మరి!

​1. యాపిల్

యాపిల్ కు చెందిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 7, ఐఫోన్ 8, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ X,ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లకు ఎయిర్ టెల్ ఈ వైఫై కాలింగ్ ఫీచర్ అందించింది. జియో కూడా ఈ స్మార్ట్ ఫోన్లకే తన వైఫై కాలింగ్ ఫీచర్ ను అందించింది.

​2. అసుస్

అసుస్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకు జియో వైఫై కాలింగ్ ను అందించలేదు. కానీ ఎయిర్ టెల్ మాత్రం వీటికి కూడా ఆ ఫీచర్ ను అందించింది. అసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, అసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

​3. కూల్ ప్యాడ్

జియో తరహాలో ఎయిర్ టెల్ కూడా కూల్ ప్యాడ్ కంపెనీకి చెందిన కొన్ని స్మార్ట్ ఫోన్లకు ఈ వైఫై కాలింగ్ ఫీచర్ ను అందించింది. కూల్ ప్యాడ్ కూల్ 3, కూల్ ప్యాడ్ కూల్ 5, కూల్ ప్యాడ్ నోట్ 5, కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్, కూల్ ప్యాడ్ మెగా 5సీ స్మార్ట్ ఫోన్లకు కూడా ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. మిగతా ఫోన్లకు కూడా భవిష్యత్తులో ఈ ఫీచర్ అందిస్తారేమో చూడాలి!

​4. జియోనీ

జియోనీ స్మార్ట్ ఫోన్లకు జియో వైఫై కాలింగ్ ఫీచర్ ను అందించలేదు. కానీ ఎయిర్ టెల్ మాత్రం రెండు జియోనీ ఫోన్లకు ఈ ఫీచర్ ను అందించింది. జియోనీ ఎఫ్205 ప్రో, ఎఫ్103 ప్రో స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ ను ఎంజాయ్ చేయవచ్చు.

5. ఇన్ ఫీనిక్స్

జియో ఈ సంస్థకు చెందిన ఫోన్లకు మాత్రమే వైఫై కాలింగ్ ఫీచర్ ను అందిస్తే ఎయిర్ టెల్ మాత్రం ఏకంగా 9 స్మార్ట్ ఫోన్లకు అందించింది. ఇన్ ఫీనిక్స్ హాట్ 8, ఇన్ ఫీనిక్స్ ఎస్5 లైట్, ఇన్ ఫీనిక్స్ ఎస్5, ఇన్ ఫీనిక్స్ నోట్ 4, ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 2, ఇన్ ఫీనిక్స్ నోట్ 5, ఇన్ ఫీనిక్స్ ఎస్4, ఇన్ ఫీనిక్స్ స్మార్ట్ 3, ఇన్ ఫీనిక్స్ హాట్ 7 స్మార్ట్ ఫోన్లకు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

6. ఐటెల్

జియో తరహాలో ఎయిర్ టెల్ కూడా ఐటెల్ కు చెందిన ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ కు వైఫై కాలింగ్ ఫీచర్ ను అందించింది. అయితే జియో ఐటెల్ ఎస్42 స్మార్ట్ ఫోన్ కు ఈ ఫీచర్ ను అందించగా.. ఎయిర్ టెల్ మాత్రం ఐటెల్ ఏ46 స్మార్ట్ ఫోన్ కు ఈ ఫీచర్ ను అందించింది.

​7. మైక్రోమ్యాక్స్

దేశీయ మొబైల్ బ్రాండ్ అయిన మైక్రోమ్యాక్స్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు కూడా జియో వైఫై కాలింగ్ ఫీచర్ ను అందుకున్నాయి. మైక్రోమ్యాక్స్ ఇన్ ఫినిటీ ఎన్12, మైక్రోమ్యాక్స్ ఇన్ ఫినిటీ ఎన్11, మైక్రోమ్యాక్స్ బీ5 ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ ను అందుకున్నాయి. అయితే జియో మైక్రోమ్యాక్స్ యూజర్లకు ఈ సేవలను అందించలేదు.

8. మొబీస్టార్(Mobiistar)

బ్రాండ్ పేరు వినడానికి కొత్తగా ఉన్నా జియో తరహాలోనే ఎయిర్ టెల్ కూడా ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్లకు వైఫై కాలింగ్ ఫీచర్ ను అందించింది. మొబీస్టార్ సీ1, మొబీస్టార్ సీ2, మొబీస్టార్ సీ1 షైన్, మొబీస్టార్ సీ1 లైట్, మొబీస్టార్ ఎంజాయ్ మోర్ ఎక్స్1 సెల్ఫీ, మొబీస్టార్ ఎక్స్1 నాచ్ స్మార్ట్ ఫోన్లకు ఈ వైఫై కాలింగ్ ఫీచర్ ను అందుకున్నాయి.

​9. వన్ ప్లస్

వన్ ప్లస్ కు చెందిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు కూడా ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ ను అందుకున్నాయి. అయితే జియో మాత్రం తన వైఫై కాలింగ్ ఫీచర్ ను వన్ ప్లస్ డివైస్ లకు అందించలేదు. వన్ పస్ల్ 6, వన్ ప్లస్ 6టీ, వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7టీ, వన్ ప్లస్ 7టీ ప్రో స్మార్ట్ ఫోన్లకు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ లభించింది.

​10. పానసోనిక్

పానసోనిక్ పీ100, పానసోనిక్ ఎలూగా రే 700, పానసోనిక్ పీ95, పానసోనిక్ పీ85 ఎన్ఎక్స్ టీ స్మార్ట్ ఫోన్లకు ఎయిర్ టెల్ తన వైఫై కాలింగ్ సేవలను అందించనుంది. అయితే జియో వైఫై సేవలను అందుకున్న స్మార్ట్ ఫోన్లలో ఈ బ్రాండ్ కు స్థానం లభించలేదు. భవిష్యత్తులో జియో కూడా ఈ కంపెనీ ఫోన్లకు వైఫై కాలింగ్ సేవలను అందిస్తుందేమో చూడాలి.

​11. శాంసంగ్

జియో తరహాలో ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ సపోర్టెడ్ డివైసెస్ జాబితాలో శాంసంగ్ కు చెందిన మొబైళ్లు కూడా భారీగానే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్10, గెలాక్సీ ఎస్10+, గెలాక్సీ ఎస్10ఈ, గెలాక్సీ ఎం20, గెలాక్సీ జే6, గెలాక్సీ ఆన్ 6, గెలాక్సీ ఎం30ఎస్, గెలాక్సీ ఏ10ఎస్, గెలాక్సీ ఏ50ఎస్, గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్లు ఈ ఫీచర్ ను అందుకున్న స్మార్ట్ ఫోన్ల జాబితాలో ఉన్నాయి.

​12. స్పైస్

ఈ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్లు కూడా జియో వైఫై కాలింగ్ సర్వీస్ ను కాకుండా కేవలం ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ను మాత్రమే అందుకున్నాయి. స్పైస్ ఎఫ్311, స్పైస్ ఎం5353 రెండు మొబైల్స్ కు మాత్రమే ఈ ఫీచర్ లభించింది.

​13. టెక్నో

టెక్నోకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఈ జాబితాలో భారీగానే స్థానం సంపాదించాయి. ఫాంటం 9, స్పార్క్ గో ప్లస్, స్పార్క్ గో, స్పార్క్ ఎయిర్, స్పార్క్ 4, కెమాన్ ఏస్ 2, కెమాన్ ఏస్ 2ఎక్స్, కెమోన్12 ఎయిర్, స్పార్క్ పవర్ స్మార్ట్ ఫోన్లకు ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ లభించింది.

​14. వివో

వివోకు చెందిన రెండు స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ ను అందుకున్నాయి. ప్రస్తుతానికి వివో వీ15 ప్రో, వివో వై17 స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఈ వైఫై కాలింగ్ ఫీచర్ లభించింది. అయితే త్వరలోనే ఈ జాబితాలో మరిన్ని స్మార్ట్ ఫోన్లు చేరే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది.

​15. షియోమీ

భారతదేశంలో నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతానికి పోకో ఎఫ్1, రెడ్ మీ కే20, రెడ్ మీ కే20 ప్రో, రెడ్ మీ 7ఏ, రెడ్ మీ నోట్ 7 ప్రో, రెడ్ మీ వై3, రెడ్ మీ 7 ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. రెడ్ మీ తాజా స్మార్ట్ ఫోన్లయిన నోట్ 8 సిరీస్ కు కూడా ఈ ఫీచర్ అప్పుడే లభించలేదు. భవిష్యత్తులో మరిన్ని షియోమీ స్మార్ట్ ఫోన్లకు ఈ ఫీచర్ లభించనుంది.

​16. జోలో

జియో అందించనప్పటికీ ఎయిర్ టెల్ మాత్రం జోలోకు చెందిన ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ కు వైఫై కాలింగ్ సర్వీస్ ను అందించనుంది. జోలో జెడ్ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు వైఫై ద్వారా కాల్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.