Templates by BIGtheme NET
Home >> GADGETS >> ఈ నెలలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.15000లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే!

ఈ నెలలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.15000లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే!


భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫోన్లలో ముందంజలో ఉండేవి రూ.15,000లోపు స్మార్ట్ ఫోన్లే. అందుకే ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేయాలనుకునే వారిని గందరగోళానికి గురి చేసే అన్ని మొబైల్ ఫోన్లు ఇందులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ నుంచి ఈ విభాగంలో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒకే బ్రాండ్ కు సంబంధించిన మొబైల్ ఫోన్ నే కొనుగోలు చేయాలన్నా కూడా వినియోగదారులు ఆలోచించాల్సిన పరిస్థితి. కాబట్టి రూ.15,000 విభాగంలో ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు సమయం తెలుగు పాఠకుల కోసం..

​1. రెడ్ మీ నోట్ 8 ప్రో..

రెడ్ మీ నుంచి వచ్చే ఫోన్లలో దీని కంటే కే20 కాస్త మంచిదే కానీ.. దాని ధర దీని కంటే ఎక్కువ. కాబట్టి రూ.15 వేలలోపు మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారు దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీని ధర ప్రస్తుతం రూ.14,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఉన్న ప్రధాన ఫీచర్ల గురించి చెప్పాలంటే.. 6.53 అంగుళాల స్క్రీన్ ను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో 90T ప్రాసెసర్ సాయంతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఎంఐయూఐపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

​2. రియల్ మీ 5 ప్రో

మార్కెట్లోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇప్పటి వరకు ఉన్న దిగ్గజాలను కూడా సవాల్ చేస్తున్న రియల్ మీ విడుదల చేసిన ఫోన్ ఈ రియల్ మీ 5 ప్రో. రియల్ మీ విడుదల చేసిన అత్యంత విజయవంతమైన ఫోన్లలో ఇది కూడా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3 అంగుళాల స్క్రీన్ ను ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లలో అత్యంత చవకైన ఫోన్ రియల్ మీ 5 ప్రోనే. 4,035 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇందులో వెనకవైపు 48 మెగా పిక్సెల్ కెమెరా ఉండగా, ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

​3. శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్

శాంసంగ్ గతేడాది ఎంతో ప్రచారం చేసి విడుదల చేసిన ఫోన్లలో ఈ గెలాక్సీ ఎం30ఎస్ స్మార్ట్ ఫోన్ కూడా ఉంటుంది. రూ.15,000 లోపు శాంసంగ్ అందించే ఉత్తమమైన ఫోన్ ఇదే. ఈ ఫోన్ లో అందరినీ ఆకట్టుకున్న విషయం ఏంటంటే.. ఇందులో ఉన్న 6,000 ఎంఏహెచ్ బ్యాటరీనే. అంతేకాకుండా ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. 6.4 అంగుళాల అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ వెనకభాగంలో 48 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. శాంసంగ్ ఎక్సోనిస్ 9610 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.13,999గా ఉంది.

​4. రెడ్ మీ నోట్ 7 ప్రో

గతేడాది అత్యధికంగా అమ్ముడు పోయిన షియోమీ ఫోన్ల జాబితాను చూస్తే.. ఈ ఫోన్ కూడా కచ్చితంగా ఉంటుంది. 48 మెగా పిక్సెల్ కెమెరా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, ఆకర్షణీయంగా కనిపించే వివిధ రంగుల్లో అందుబాటులో ఉండటం వినియోగదారులను ఈ ఫోన్ వైపు మొగ్గు చూపేలా చేశాయి. 6.3 అంగుళాల స్క్రీన్ ను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. వెనకవైపు 48 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంది. ధర తగ్గింపు అనంతరం ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది.

​5. షియోమీ ఎంఐ ఏ3

షియోమీ తన ఆండ్రాయిడ్ వన్ సిరీస్ లో లాంచ్ చేసిన మూడో స్మార్ట్ ఫోన్ ఈ షియోమీ ఎంఐ ఏ3. ఎంఐ ఏ2పై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఈ ఫోన్ కచ్చితంగా సక్సెస్ కావాల్సిన అవసరం వచ్చింది. దీంతో షియోమీ ఎంతో జాగ్రత్తతో రూపొందించిన ఈ ఫోన్ సక్సెస్ అయింది. షియోమీ ఫోన్లలో ఉండే ఎంఐయూఐ కాకుండా ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ 6.01 హెచ్ డీ+ అంగుళాలుగా ఉండనుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిస్తుంది. 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వెనకవైపు 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాగా గల ట్రిపుల్ కెమెరా సెటప్, ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఎంఐ ఏ3 ధర రూ.12,499 నుంచి ప్రారంభం కానుంది.

6. మోటొరోలా వన్ విజన్

ఆండ్రాయిడ్ వన్ సిరీస్ లో మోటొరోలా విడుదల చేసిన స్మార్ ఫోన్లలో మోటొరోలా వన్ విజన్ కూడా ఒకటి. ఆకట్టుకునే ఫీచర్లు, అదిరిపోయే డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. ఇందులో 6.3 అంగుళాల స్క్రీన్ ను అందించారు. వెనకవైపు 48 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ముందువైపు 25 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఎక్సోనిస్ 9609 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3,500 ఎంఏహెచ్ గా ఉంది. మోటొరోలా వన్ విజన్ ధర రూ.14,999గా ఉంది.

​7. రియల్ మీ 3 ప్రో

రెడ్ మీ నోట్ 7 ప్రోకు సరైన పోటీ, రూ.15 వేల శ్రేణిలో ఉన్న అత్యుత్తమ ఫోన్లలో ఒకటి ఈ రియల్ మీ 3 ప్రో. షియోమీ తరహాలో 48 మెగా పిక్సెల్ కెమెరాను అందించకపోయినా నాణ్యమైన కెమెరా దీని సొంతం. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3 అంగుళాల స్క్రీన్ ఇందులో ఉంది. శక్తివంతమైన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఈ ప్రాసెసర్ ద్వారా ఫోన్ ఎంతో బాగా పనిచేస్తుంది. హై-ఎండ్ గేమ్స్ ను కూడా సపోర్ట్ చేయడం ప్రత్యేకత. వెనకవైపు 16 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు, ముందు వైపు 25 మెగా పిక్సెల్ కెమెరాను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4,045 ఎంఏహెచ్ గా ఉంది. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది.

​8. రెడ్ మీ నోట్ 7ఎస్

రెడ్ మీ నోట్ 7, రెడ్ మీ నోట్ 7 ప్రోలకు మధ్యలో ఉండే ఫోన్ లాగా షియోమీ దీన్ని రూపొందించింది. ఈ రెండు ఫోన్లలో ఉండే కొన్ని కీలక ఫీచర్లను అందిపుచ్చుకున్న ఈ ఫోన్ తక్కువ ధరలో శక్తివంతమైన ఫోన్ గా నిలిచింది. ఇందులో 6.3 అంగుళాల డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ పై ఈ ఫోన్ చేయనుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనకవైపు 48 మెగా పిక్సెల్, ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరాలను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది.

​9. రెడ్ మీ నోట్ 7

గతేడాది షియోమీ లాంచ్ చేసిన అత్యుత్తమ బడ్జెట్ ఫోన్లలో రెడ్ మీ నోట్ 7 కూడా ఒకటి. రెడ్ మీ నోట్ 7 స్థాయిలో 48 మెగా పిక్సెల్ కెమెరా లేకపోయినా.. ఇందులో ఉన్న కెమెరా నాణ్యత మిమ్మల్ని నిరాశ పరచదు. ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ 6.3 అంగుళాలుగా ఉంది. వెనకవైపు 12 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు అందుబాటులో ఉండగా, ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది.

​10. శాంసంగ్ గెలాక్సీ ఎం30

శాంసంగ్ నుంచి గతేడాది విడుదలైన అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ ఎం30 కూడా ఒకటి. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని స్క్రీన్ సైజ్ 6.3 అంగుళాలుగా ఉంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను కూడా ఇందులో అందించారు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. ఎక్సోనిస్ 7904 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్స్ లో హెచ్ డీ కంటెంట్ ను స్ట్రీమ్ చేయడానికి అవసరమైన వైడ్ వైన్ ఎల్1 సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.9,499 నుంచి ప్రారంభం కానుంది.

​రియల్ మీ ఎక్స్ టీ(Special Consideration)

రూ.15 వేల కంటే కాస్త ఎక్కువగా(రూ.15,999) ఉన్న రియల్ మీ ఎక్స్ టీ ధర ఉంది. రూ.15 వేల బడ్జెట్ లో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు ఒక రూ.1,000 ఎక్కువగా పెడితే ఈ ఫోన్ ను పొందవచ్చు. ఈ బడ్జెట్ శ్రేణిలో ఉన్న అత్యుత్తమ ఫోన్లలో రియల్ మీ ఎక్స్ టీ కూడా కచ్చితంగా ఉంటుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోలెడ్(AMOLED) డిస్ ప్లే ఉంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.