Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> అబార్షన్లు ఇలా కూడా అవుతున్నాయట..

అబార్షన్లు ఇలా కూడా అవుతున్నాయట..


శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.. మనుషులను చంపుతున్నాయి. మనల్నే కాదు.. కడుపులోని పిండాలను సైతం కబళించేలా వాతావరణం తయారవుతోందని సర్వేలో తేలింది. గాలి కాలుష్యంతో అబార్షన్లు జరుగుతాయని ఓ సర్వేలో తేలింది. భారత్-పాకిస్తాన్ సహా దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కంటే అధిక స్థాయిలో కాలుష్యం ఉందని తెలిపింది.

ఈ కాలుష్యం వల్ల అబార్షన్లు పుట్టిన వెంటనే బిడ్డ మరణించడం వంటి పరిస్థితులకు కారణం అవుతోందని తెలిపింది.

29శాతం అబార్షన్లకు వాయుకాలుష్యమే కారణమని సర్వే తేల్చింది. ముఖ్యంగా కాలుష్యం అత్యధికంగా ఉండే ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ మరణాలకు ఆస్కారం ఎక్కువని తేలింది.గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈ కాలుష్యం కనిపిస్తోందని తేలింది.