ఇక్కడ మచ్చలుంటే మీకు డబ్బే నిలబడదట.?

0

కరోనా-లాక్ డౌన్ తో అందరి ఉపాధి పోయింది. అందరూ రోడ్డున పడ్డారు. బిజినెస్ లు దెబ్బతిన్నాయి. వ్యాపారాలు లాస్ అయ్యాయి. మన కలలు అన్నీ కల్లలయ్యాయి. కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన సొమ్ము వచ్చినట్టే ఖర్చయిపోతుంది. అందుకు మీ పుట్టుమచ్చలు కూడా కారణం కావచ్చని అస్ట్రాలజిస్టులు వాపోతున్నారు. పుట్టుమచ్చలకు డబ్బులకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? కానీ మన పూర్వీకులు సైతం గ్రంథాల్లో కొన్ని సంకేతాల ద్వారా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ కింద ఉన్న భాగాల్లో మీకు మచ్చు ఉంటే డబ్బు నిలవదని సూచించారు. నమ్మడం .. నమ్మకపోవడం మీరు ఆలోచించాలి.. కానీ అస్ట్రాలజిస్టులు పూర్వీకుల గ్రంథాలు మాత్రం దీన్ని ధ్రువపరుస్తున్నాయి.

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. శరీరంలోని నిర్ధిష్ట భాగాలలో మచ్చలు ఉన్నవారు ఆడవారైనా.. మగవారైనా అనివార్యంగా డబ్బులను ఖర్చు పెడుతూ బాధపడుతూ ఉంటారు. ఈ 8 ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే సంపాదనపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు.

*ఎడమ చెంపపై మచ్చ ఉంటే ఆదాయం పుష్కలంగా లభిస్తుంది. సంపాదనను సేవ్ చేయడంలో మాత్రం విఫలమవుతుంటారు. ఆదాయం ఎక్కువగా ఖర్చయిపోతుంది.

*పెదాల పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే సంపదకు లోటు ఉండదు. కింద ఉంటే డబ్బులకు కష్టాలు పడాల్సి ఉంటుంది.

*అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు.

*ఎడమకాలి మీద పుట్టుమచ్చ ఉంటే సంపాదించిన సంపదనంతా ఖర్చు చేస్తారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు నిలవదట..

*చూపుడు వేలిపై లేదా బొటనవేలికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే జీవితాంతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కడుపునిండా కూడుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

*అరచేతికి ఉంగరం వేలికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే డబ్బు చేతికి దొరకదు.

*కనుబొమ్మల్లో ఎడమ కంటిపాప లేదా కంటిపాప నుదురు మధ్య పుట్టుమచ్చ ఉంటే మీరు లైంగిక ఆనందంలో బలహీనంగా ఉన్నారని అర్థం. దీనికి డబ్బే ప్రధాన సమస్య

*ఎడమచేతి చంకలో పుట్టుమచ్చ ఉంటే తీవ్రమైన వ్యాధులు రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట..

మన ప్రాచీన గ్రంథాలు శాస్త్రాలు అస్ట్రాలజిస్టులు ఇలా వర్గీకరించారు. ఇవి నమ్మడం.. నమ్మకపోవడం అనేది మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.