Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> కౌగిలించుకుంటే ఆరోగ్యంగా ఉంటారట..

కౌగిలించుకుంటే ఆరోగ్యంగా ఉంటారట..


స్పర్శ అనేది కొన్ని చెప్పలేని భావాలను చూపిస్తుంది. అది ఆత్మీయ స్పర్శ కావొచ్చు. ఏదైనా కావొచ్చు.. ఎన్నో భావాలను ఒక్క స్పర్శతో చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కవ్వింత కూడా.. అంతేనా.. కౌగిలించుకోవడం వల్ల మానసిక, శారీరకమైన ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

​హగ్‌తో ఆరోగ్యం..

ఓ సినిమాలో చెబుతారు. ఆత్మీయంగా ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు.. మనసు లోపల ఉన్న ఎన్ని బాధలు అయినా క్షణాల్లో కరిగిపోతాయి అని.. ఇది మనం సినిమా అనుకుంటాం.. కానీ, నిజానికీ ఇదే నిజమంటున్నారు పరిశోధకులు. మనం ఎవరినైనా ప్రేమతో కౌగిలించుకుంటే అది మనకి.. వారికి కూడా ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. చెప్పలేని భావాలను ఎన్నో ఈ కౌగిలింతతో చెప్పొచ్చు.

​ప్రేమను వ్యక్తపరిచే కవ్వింత..

కవ్వింత అంటే కేవలం లైఫ్‌ పార్టనర్‌ని, కోరికలతో మాత్రమే కవ్వించుకోం.. ఇది అందరికీ తెలిసింది. అమ్మని కౌగిలించుకుంటాం.. నాన్నని కూడా కౌగలించుకుంటాం, ఇలా మనకి ఆత్మీయులు ఎవరెవరూ ఉన్నారో వారందరినీ కౌగలించుకుంటాం. ఎందుకంటే ఎన్నో భావోద్వేగాలకు, ప్రేమకు కౌగిలింత అనేది ఓ చక్కటి చిహ్నం. ఆలింగనం అనేది కఏదో ఆషామాషీగా వచ్చేది కాదు. ప్రేమను పంచడానికి, వ్యక్తపరచడానికి ఇది ఉపయోగపడతుంది.

​ఆనందాన్ని రెట్టింపు చేసే కవ్వింత

మనకి ఎక్కువ సంతోషం ఉన్నప్పుడు.. లేదా బాధలో ఉన్నప్పుడు మన ఆత్మీయులని కౌగిలించుకుంటే ఆ ఫీలింగ్‌ని వారితో పంచుకున్నవారవుతాం.. అందుకే చాలా మంది సంతోషంలోనైనా, బాధలోనైనా మన సన్నిహితులతోనే పంచుకుంటాం. లైఫ్‌ పార్టనర్‌ని కౌగిలించుకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం రెట్టింపు అవుతుంది. ఆ ఆనందం రెట్టింపు అవుతుంది.

​కౌగిలింతల్లోనూ రకాలు..

అయితే, కౌగిలింత అనేది ఒక్కటే అని కాదు.. ఇందులోనూ రకాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో బియర్ హగ్, ఆప్యాయతతో ఆలింగనం, వీడ్కోలు కౌగిలింత, పొలైట్ కౌగిలింత, ముద్దుల కవ్వింత ఇలా అనేక కౌగిలింతలు ఉన్నాయి. ఇవి సందర్భాన్ని బట్టి వ్యక్తులను బట్టి ఉంటాయి. ఇందులో ఒక్కో కౌగిలింతకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది.

​బాధను తగ్గించే కవ్వింత..

సాధారణంగా బాధలో ఉన్నప్పుడు కౌగిలించుకున్నప్పుడు మనకి తోడుగా కొంతమంది ఉన్నారని చెబుతారు. దీని వల్ల ఆ బాధ చాలా వరకూ తగ్గుతుంది. దీంతో మనసు కాస్తా తేలికపడి బాధ తగ్గిపోతుంది.

​సంతోషాన్ని రెట్టింపు చేసే కవ్వింత..

సంతోషంలో ఉన్నప్పుడు కౌగిలించుకుంటే ఆ ఆనందాన్ని మన సన్నిహితులతో పంచుకున్నట్లు ఉంటుంది. దీంతో ఆ ఆనంద క్షణాలు రెట్టింపు అవుతాయి. ఇది కూడా శరీరానికి చాలా మంచిది. మనసు బాగుండాలి. బాగుంటే ఆటోమేటిగ్గా ఆరోగ్యం కూడా బావుంటుంది కాబట్టి కౌగిలింతల వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు..