Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> భార్యాభర్తల మధ్య ఆ గ్యాప్ వచ్చిన డేంజరేనట?

భార్యాభర్తల మధ్య ఆ గ్యాప్ వచ్చిన డేంజరేనట?


మొగుడు పెళ్లాలన్నాక.. కొట్టుకోవడం.. ఆ తర్వాత కౌగిలించుకోవడం సులభం. ఈ మధ్య యూపీలో ఒకావిడ మొగుడు అస్సలు కోప్పడడం లేదని.. ప్రతీదానికి పొగుడుతూనే ఉన్నాడని.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడని.. స్పైసీ లేని జీవితం తనకు వద్దంటూ విడాకులిచ్చింది. ఇలా ఈ కాలంలో ఏది తక్కువైనా.. ఎక్కువైనా కూడా ఎవ్వరూ భరించడం లేదు. ఇద్దరి మధ్య గ్యాప్ వస్తే విడాకులే తీసుకుంటున్నారు.

ఇక అభిప్రాయభేదాలు.. వాగ్వాదాలు గొడవలే కాదు.. శృంగారం విషయంలోనూ ఇదే వర్తిస్తుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. భార్య భర్తల మధ్య శృంగారం విషయంలో గ్యాప్ వచ్చినా కష్టమేనని చెబుతున్నారు. అది జరిగితే బంధం బలపడుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా.. శృంగారంలో సహకరించకున్నా భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా చూసుకోవాలని నిపుణులు హితవు పలుకుతున్నారు.అంతేకాదు.. జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం ఇంటికి.. భాగస్వామితో శృంగారానికి కేటాయించినప్పుడే ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుందని సూచిస్తున్నారు. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుందని సూచిస్తున్నారు.