ఏడాది పూర్తి చేసుకున్న ప్రభాస్ బాలీవుడ్ సాహో

0

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడితో లేదంటే మరో పెద్ద దర్శకుడితో సినిమా చేయాల్సింది పోయి కేవలం ఒక్క సినిమా అనుభవం అది కూడా చిన్న వయసు దర్శకుడితో సినిమా చేయడం ఏంటీ అంటూ సాహో చేస్తున్న సమయంలో ప్రభాస్ ను కొందరు కామెంట్స్ చేశారు. సాహో సినిమా బాలీవుడ్ లో ఆకట్టుకుంటుందో లేదో అనే అనుమానాల మద్య విడుదలైన ఆ సినిమా ఏకంగా 400 కోట్ల వసూళ్లను సాధించింది.

సౌత్ లో సినిమాకు యావరేజ్ మూవీ అంటూ టాక్ వచ్చింది. కాని బాలీవుడ్ లో ఈ సినిమా వసూళ్లు చూస్తే సూపర్ హిట్ మూవీ అనుకోవచ్చు. అంతగా సాహో అక్కడ సక్సెస్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా ఇప్పటి వరకు రాని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ సాహోలో ఉండటంతో హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలాంటి సినిమాలు ముందు ముందు మరిన్ని రావాలి అన్నట్లుగా వారు సాహోను ఆధరించారు.

సాహో సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్న సందర్బంగా ప్రభాస్ సోషల్ మీడియాలో సాహో పోస్టర్ పోస్ట్ చేశాడు. డై హార్ట్ ఫ్యాన్స్ కు మరియు సాహో టీం అందరికి కూడా సాహో విడుదల అయ్యి ఏడాది అయిన సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్ చేశాడు. ప్రభాస్ పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా ఆరు లక్షల లైక్స్ ను ఈ ఫొటో దక్కించుకుంది. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఓం రౌత్ సినిమా ఆదిపురుష్ మరోసారి బాలీవుడ్ లో సునామిని సృష్టించడం ఖాయం అన్నట్లుగా ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.