పొట్టి ఫ్రాకులతో సంపకలా సిన్నదానా!

0

వెటరన్ హీరోలకు కథానాయికలు దొరక్క నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వరకూ గల్లీ గల్లీ జల్లెడ పట్టినా హీరోయిన్లు దొరకడం లేదు పాపం. మరి అలాంటివారికి సోనాల్ ఒక ఆప్షన్ అవుతుందా? అంటే .. ఒకే ఒక్క బాలయ్య మినహా వేరే ఎవ్వరూ ఎందుకనో అవకాశం అయితే ఇవ్వడం లేదు. చిరు.. వెంకీ.. నాగార్జున వంటి స్టార్లు ఉన్నా సోనాల్ వైపు ఓ చూపు చూసిందేమీ లేదు.

ఏదో బోయపాటి తనకు వరుసగా అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తే.. ఆ తర్వాత శ్రీవాస్ లాంటి దర్శకుడు సోనాల్ లో దాగి ఉన్న ట్యాలెంటును బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే బాలయ్య లాంటి సీనియర్ తో నటించాక.. కుర్రహీరోలు ఎందుకనో మొహం చాటేసారు.

రీజన్ ఏదైనా.. తనకు ఇప్పట్లో టాలీవుడ్ లో అవకాశాలు లేనట్టేనా? అందుకేనా ఇదిగో ఇలా అందాల వలలు వేస్తోంది. సోనాల్ నిరంతర సోషల్ మీడియా ఫోటో ట్రీట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. లస్ట్ స్టోరీస్ సీక్వెల్ తీస్తే సోనాల్ ని పిలవాల్సిందేనంటూ వెబ్ సిరీస్ బ్యాచ్ లోనూ టాక్ వినిపిస్తోందట.

కాజల్ -నయనతార- తమన్నా- త్రిష వీళ్లంతా సైడైపోయాక.. రకుల్ లాంటి వాళ్లు ఫేడవుట్ అయిపోతుంటే సోనాల్ లాంటి భామలకు అవకాశం ఇస్తే తప్పేమీ కాదేమో!